COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nubia Z60 Ultra Price: శక్తివంతమైన బ్యాటరీతో పాటు, ప్రీమియం కెమెరా సెటప్‌ కలిగిన కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ మొబైల్‌  Nubia Z60 Ultra పేరుతో మార్కెట్‌లో లభిస్తోంది. అద్భుతమైన డిజైన్‌ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌..గరిష్టంగా 16 GB RAM, 1 TB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో విడుదల చేసింది. ఈ మొబైల్‌ బ్యాక్‌ సెట్‌లో  50 మెగాపిక్సెల్ కెమెరా బ్యాక్‌ కెమెరా, 64 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే శక్తివంతమైన బ్యాటరీతో 80 వాట్ల వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర, ఇతర స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక ఈ  Nubia స్మార్ట్‌ ఫోన్‌ డిస్ల్పే విషయానికొస్తే..ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో పాటు 2480x1116 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.8 అంగుళాల BOE Q9+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌లో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ఈ Nubia Z60 Ultra ఫోన్‌ను గరిష్టంగా 16 GB LPDDR5x ర్యామ్‌, 1 TB వరకు UFS 4.0 స్టోరేజ్ ఆప్షన్‌తో విడుదల చేసింది. ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


ఈ Nubia Z60 Ultra మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో భాగంగా 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా‌తో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 64 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా అందిస్తోంది. ఈ మూడు కెమెరాలు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా బ్యాక్‌ కెమెరాలతో 4K రిజల్యూషన్, 120fps వీడియో రికార్డింగ్‌ చేయోచ్చు. ఈ Nubia Z60 Ultra గస్మార్ట్‌ ఫోన్‌ వీడియో కాలింగ్‌ కోసం 12 మెగాపిక్సెల్స్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే, కంపెనీ ఈ మొబైల్‌కు ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో అందించింది. 


ఈ మొబైల్‌ బ్యాటరీ 80 వాట్ల వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా My OS 14పై ఈ Nubia Z60 Ultra మొబైల్‌ పని చేస్తుంది. కనెక్టివిటీ కోసం..బ్లూటూత్ 5.4, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS, NFCతో పాటు డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ అతి త్వరలో భారత మార్కట్‌లో కూడా విడుదల చేసేందుకు యోచిస్తోంది. చైనా ఈ మొబైల్‌ ధర రూ. 4299 యువాన్ (సుమారు రూ. 51 వేలు)లకు లభిస్తోంది.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి