Oneplus 12R Genshin Impact Edition: వన్‌ప్లస్ నుంచి అరుదైన ఎడిషన్.. పక్కా కొనాలనిపించే డిజైన్, ఫీచర్స్..
Oneplus 12R Genshin Impact Edition: ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్ ఇటీవలే విడుదల చేసిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను రేర్ ఎడిషన్‌లో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఇది కొత్త లుక్‌లో కనిపించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 12R Genshin Impact Edition: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ OnePlus మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను కొత్త ఎడిషన్‌లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్‌ను కంపెనీ OnePlus 12R Genshin ఇంపాక్ట్ ఎడిషన్ పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని గ్లోబల్ మార్కెట్‌లో ఫిబ్రవరి 28న లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కంపెనీ లాంచింగ్ వివరాలను కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ భారీ ఆఫర్స్:
వన్‌ప్లస్ కంపెనీ ఈ కొత్త ఎడిషన్‌ను ప్రత్యేక లాంచింగ్ ఈవెంట్‌లో భాగంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ దీనిని సాయంత్రం 4:30 గంటలకు లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో పాటు ఇదే ఈవెంట్‌లో భాగంగా కస్టమర్స్ మనసు దోచే ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి 'నోటిఫై మీ' అనే ఆప్షన్‌ను చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక ఆఫర్స్‌లో భాగంగా అభిమానులు ప్రత్యేక ఎడిషన్ ఫోన్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.
ఈ OnePlus 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ గేమ్ క్యారెక్టర్ కాకింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్‌ను రూపొందించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చూడడానికి ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. దీంతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎలక్ట్రో-వైలెట్ కలర్ ఆప్షన్‌లో కంపెనీ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది ప్రత్యేకమైన జెన్‌షిన్ ఇంపాక్ట్-థీమ్ గూడీస్‌తో కస్టమ్-డిజైన్ మార్కెట్‌లో కస్టమర్స్‌కి లభించనుంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఈ కొత్త స్పెషల్ ఇంతకముందు లాంచ్ చేసిన OnePlus 12R ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పోలి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో కూడిన 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా దీని డిస్ల్పే ప్రోటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇక ఓఎస్ విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 1పై రన్‌పై పని చేస్తోంది. దీంతో పాటు OS అప్‌గ్రేడ్‌లను కూడా కంపెనీ మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇతర ఫీచర్స్:
100W ఛార్జింగ్ సపోర్ట్
5500mAh బ్యాటరీ
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
డ్యూయల్ స్పీకర్లు
IR బ్లాస్టర్
IP65-రేటెడ్ ఛాసిస్
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter