COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oneplus 9 Pro Price Cut: అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ కొన్ని వన్‌ప్లస్‌ గుడ్‌ కండీషన్‌ కలిగిన పాత స్మార్ట్‌ ఫోన్స్‌ని పరిచయం చేసింది. అమెజాన్‌లో OnePlus 9 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌ కేవలం 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఈ ఎక్స్‌లెంట్‌ కండీషన్‌ కలిగిన మొబైల్‌పై కూడా భారీ తగ్గింపు తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


అమెజాన్‌లో ఈ కొత్త OnePlus 9 5G స్మార్ట్ ఫోన్‌ ధర MRP రూ.49,999 కాగా ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌లో భాగంగా భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం పాత స్మార్ట్‌ ఫోన్‌ను రూ.27,999కే విక్రయిస్తోంది. ఈ మొబైల్‌పై దాదాపు 40 శాతం తగ్గింపుతో అందిస్తోంది. దీంతో పాటు ఈ పాత స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Citibank,  IDFC FIRST బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా OneCard, HSBC క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ మొబైల్‌ను రూ.26,499కే పొందవచ్చు. 


OnePlus 9 5G ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.55 అంగుళాలు AMOLED డిస్ల్పే(2400 x 1080 పిక్సెల్)ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 4500 mAh లిథియం అయాన్ బ్యాటరీ, బ్యాక సెటప్‌లో 48MP ప్రధాన కెమెరాతో వచ్చింది. అలాగే వార్ప్ ఛార్జ్ 65 పవర్ అడాప్టర్, వార్ప్ ఛార్జ్ టైప్-సి నుండి టైప్-సి కేబుల్, వారంటీ కార్డ్, లోగో స్టిక్కర్, కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్, క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, సిమ్ ట్రే ఎజెక్టర్ పాటు అనేక రకాల కనెక్టీవిటీ ఫీచర్స్‌తో రాబోతోంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


అలెక్సాకు ఫ్రీ యాక్సెస్:
OnePlus కంపెనీ ఈ 9 5G మోడల్‌లో అలెక్సా వాయిస్‌ కానెక్ట్‌ ఫీచర్‌ను కూడా ఫ్రీగా అందిస్తోంది. దీని ద్వారా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ పరికరాలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది. ఈ అలెక్సాను వినియోగించి స్మార్ట్ హోమ్ పరికరాలను సులభంగా నియంత్రించవచ్చు. దీంతో పాటు అమెజాన్‌ లైబ్రరీని యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కలిగి ఉన్నవారు Alexa యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఫ్రీ సెటప్‌ ఆప్షన్‌ను చూస్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter