Oneplus Buds 3 Price: వన్‌ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్..చీప్‌గా మార్కెట్‌లోకి OnePlus బడ్స్ 3..ధర, ఫీచర్స్ వివరాలు!
Oneplus Buds 3 Price: వన్‌ప్లస్ లవర్స్ కంపెనీ మరో గుడ్ న్యూస్ తెలిపింది. అతి త్వరలోనే కంపెనీ OnePlus Buds 3ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ బడ్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oneplus Buds 3 Price: వన్ ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్..అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్‌తో పాటు OnePlus Buds 3 TWS ఇయర్‌బడ్స్ విడుదల కాబోతున్నాయి. కంపెనీ ఈ రెండింటినీ జనవరి 4న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ముందుగా ఇవి రెండు చైనాలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇయర్ బడ్స్ విషయానికొస్తే..ప్రత్యేకమైన కలర్‌తో పాటు ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేక రంగుల్లో విడుదల లాంచ్ కాబోతున్నట్లు సమచారం. జనవరి 2023లో విడుదల చేసిన OnePlus బడ్స్ ప్రో 2 కంటే ప్రీమియం లుక్‌లో కనిపించనుంది. అయితే ఈ ఇయర్ బడ్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ నెల 4వ తేదిన విడుదల కాబోయే OnePlus Buds 3 సంబంధించిన ధర వివరాలు లాంచింగ్‌కి రెండు రోజుల ముందే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ బడ్స్‌కి సంబంధించి కొన్ని ఫీచర్స్‌ను ఇటీవలే విడుదల చేసినట్లు అందరికీ తెలిసిందే. దీంతో పాటు వన్‌ప్లస్ కంపెనీ ఈ బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.
OnePlus Buds 3 ధర:
ఆల్‌రౌండ్-PC వెల్లడించి నివేదికల ప్రకారం.. OnePlus బడ్స్ 3 ధర EUR 99 (దాదాపు రూ. 9,000)గా ఉండవచ్చని సమాచారం. ముందుగా ఈ బడ్స్‌ను కంపెనీ క్లియర్ సీ బ్లూ, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
OnePlus Buds 3 ఫీచర్స్:
ఈ OnePlus బడ్స్ 3 10.4mm డ్రైవర్లు, 6mm ట్వీటర్‌లను కలిగి ఉంటుందని సమాచారం. ఇయర్‌బడ్‌లు 48dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కి సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు Google ఫాస్ట్ పెయిర్, డ్యూయల్ కనెక్టివిటీలను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP55 రేటింగ్ సపోర్ట్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్, వర్షం సమయం కూడా వినియోగించేందుకు చాలా రకాల ఫీచర్స్‌ను అందిస్తోంది.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo పోస్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం..OnePlus బడ్స్ 3 3D సరౌండ్ సౌండ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు LHDC 5.0కి సపోర్ట్‌తో కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇయర్‌బడ్స్ మొత్తం నాన్‌స్టాప్‌గా 44 గంటల బ్యాటరీ లైఫ్‌ని పొందే సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ OnePlus బడ్స్ 3 ప్రతి ఇయర్‌బడ్‌లో 58mAh బ్యాటరీతో పాటు 4.5W ఇన్‌పుట్, 1.2W అవుట్‌పుట్ సౌండ్‌ను అందిస్తుంది.
Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter