OnePlus Smartphones: వన్‌ప్లస్ నుంచి రెండు సూపర్ స్మార్ట్ఫోన్లు, ఫీచర్లు అదిరిపోతున్నాయ్, ధర ఎంతంటే
OnePlus Smarphones: ఆపిల్ తరువాత అత్యధికంగా ఇష్టపడే స్మార్ట్‌ఫోన్లలో ముఖ్యమైంది వన్‌ప్లస్. వన్‌ప్లస్ ఇప్పుడు అధికారికంగా భారతీయ మార్కెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 రెండు వేరియంట్లను ఆవిష్కరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus Smarphones: వన్‌ప్లస్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో తేడాలేంటి, ఫీచర్లు ఏమున్నాయి, ధర ఇతర వివరాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్లు ఏమున్నాయో పరిశీలిద్దాం. ఫీచర్లపరంగా రెండూ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లుగా పరిగణిస్తున్నారు.
OnePlus Nord 3 ఫీచర్లు
వన్‌ప్లస్ నార్డ్ 3లో 6.74 ఇంచెస్ సూపర్ ఫ్లూయిడ్ 10 బిట్ ప్లేట్ 1.5కే ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇక 1000 హెర్ట్జ్ వరకూ టచ్ శాంప్లింగ్ ఉంటుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీని అందించే అల్యూమినియం మిడ్ ఫ్లేమ్ ఇందులో ఉంటుంది. ఇక డిస్‌ప్లే దెబ్బతినకుండా డ్రాగన్ ట్రేల్ గ్లాస్ ఉంటుంది. ఇక కెమేరా పరంగా చూస్తే రేర్ కెమేరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమేరాను సెంట్రల్ హోల్ కట్ అవుట్‌లో ఇచ్చారు. ఇది 16 మెగాపిక్సెల్ కలిగి ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 3 మీడియాటెక్ డైమెన్షన్ 9000 చిప్‌సెట్‌తో అనుసంధానమైంది. ఇందులో అత్యధికంగా 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది బ్యాటరీ. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్ ఉంటుంది. 80 వాట్స్ సూపర్ వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా త్వరగా ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే 5జి నానో సిమ్, 12 5జి బ్యాండ్ విడ్త్‌తో పాటు బ్లూటూత్ 5.3 వెర్షన్, వైఫై 6 వెర్షన్ ఉన్నాయి.
OnePlus Nord CE 3 ఫీచర్లు
ఇందులో 6.7 ఇంచెస్ ఫ్లూయిడ్ ఎమోల్డ్ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండి, 2160 హెర్ట్జ్ డిమింగ్ సపోర్ట్ చేస్తుంది. నార్డ్ సీఈ3 మిడ్ రేంజ్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 782 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇక కెమేరా గురించి మాట్లాడుకుంటే..ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సార్ ఉంది. ఇక బ్యాటరీ అయితే ఇది కూడా 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 80 వాట్స్ సూపర్ వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5జీ నానో సిమ్ కార్డ్, 12 5జి బ్యాండ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో బ్లూటూత్ 5.3 వెర్షన్, వైఫై 6 వెర్షన్ ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 3, నార్డ్ సీఈ 3 ధరలు
వన్‌ప్లస్ నార్డ్ 3 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర 33,999 రూపాయలుంది. ఇందులోనే 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 37,999 రూపాయలుగా ఉంది. జూలై 15 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 26,999 రూపాయలుగా ఉంది. ఇందులోనే 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ అయితే 28,999 రూపాయులుంది.
Also read: Multibagger Stocks: రెండేళ్లలో లక్ష రూపాయలు 34 లక్షలైతే ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook