OnePlus Nord 4 5G Price Dropped: మార్కెట్‌లో 8GB ర్యామ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లోనే లభించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రిడమ్‌ పెస్టివెల్‌ సేల్‌లో భాగంగా కొన్ని మొబైల్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్‌ బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలే లాంచ్‌ అయిన స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో ఏ మొబైల్‌ అతి తక్కువ ధరలో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే మార్కెట్‌లో లాంచ్‌ అయిన OnePlus Nord 4 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రిడమ్‌ పెస్టివెల్‌ సేల్‌లో అతి తక్కువ ధరల్లో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు ప్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ మూడు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇందులోని బేస్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లో ఉన్న మొబైల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ రూ.29,998తో అందుబాటులో ఉంది.



ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రిడమ్‌ పెస్టివెల్‌ సేల్‌లో OnePlus Nord 4 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు పొందవచ్చు. ఇక బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్‌ను  SBI క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి పేమెంట్ చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోను రూ.28,998కే పొందవచ్చ. అలాగే అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించడానికి పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.28,100 వరకు బోనస్‌ పొందవచ్చు. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను రూ.898కే పొందచ్చు. 


టాప్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఆక్సిజన్ OS ఆపరేటింగ్ సిస్టమ్    
5500mAh బ్యాటరీ
100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్
కేవలం 28 నిమిషాల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ 
AI బెస్ట్ ఫేస్, ఎరేజర్ & స్మార్ట్ కటౌట్ ఫీచర్స్‌
Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌
4 సంవత్సరాల గరిష్ట బ్యాటరీ సామర్థ్యం
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్, బిల్ట్-ఇన్ GPS


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.