OnePlus Nord CE4 Lite 5G Price Drop: ప్రపంచ వ్యాప్తంగా వన్‌ప్లస్‌ మొబైల్స్‌కి మంచి గుర్తింపు లభించింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉండడం వల్ల చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో క్రమంగా విక్రయాలు పెరగడంతో కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OnePlus Nord CE4 Lite 5G మొబైల్ విక్రయాల్లో దూసుకుపోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 
మార్కెట్‌లో OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ విభిన్న స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్ 8GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌లో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌లో లభిస్తోంది. ఇక ఇందులోని మొదటి వేరియంట్‌పై అమెజాన్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది. మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 5 శాతం తగ్గింపుతో కేవలం రూ.19,999కే లభిస్తుంది. దీంతో పాటు అనదంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ  OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌తో కూడా బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసిన రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసిన ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్నిపోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.18,250 తగ్గింపు లభిస్తుంది.


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:  
డిస్‌ప్లే:
6.72 ఇంచుల ఎల్‌సీడి డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేటు
ఫుల్ HD+ రిజల్యూషన్


ప్రాసెసర్:
క్వాలకమ్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్


కెమెరాలు:
ప్రధాన కెమెరా: 50MP
అల్ట్రా వైడ్ కెమెరా: 2MP
మాక్రో కెమెరా: 2MP
ఫ్రంట్ కెమెరా: 16MP


బ్యాటరీ:
భారీ 5,000mAh బ్యాటరీ
33W SUPERVOOC ఛార్జింగ్


మెమొరీ:
8GB ర్యామ్‌
128GB / 256GB స్టోరేజ్ (ఎక్స్‌పాండబుల్ కాదు)


ఆపరేటింగ్ సిస్టమ్:
ఆండ్రాయిడ్ 12 ఆధారిత OxygenOS


డిజైన్:
స్లిమ్ మరియు లైట్‌వెయిట్ బాడీ
ఆకర్షణీయమైన రంగులు


కనెక్టివిటీ:
5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS


సెన్సార్లు:
ఫింగర్‌ప్రింట్ స్కానర్ (సైడ్-మౌంటెడ్), యాక్సిలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.