OnePlus Pad Launch: వన్‌ప్లస్ నుంచి మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
OnePlus Pad launches in India. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్‌ప్లస్ నుంచి మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుంది.
OnePlus Pad Launches in India: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్‌ప్లస్ నుంచి మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుంది. వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) పేరుతో గత ఫిబ్రవరిలోనే దీన్ని ఆవిష్కరించిన వన్‌ప్లస్.. తాజాగా భారత మార్కెట్లో ధర వివరాలను, ప్రీ ఆర్డర్ బుకింగ్ తేదీలనూ ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. వన్‌ప్లస్ ప్యాడ్ ఏప్రిల్ 28న భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంటుంది.
మాగ్నటిక్ కీ బోర్డు, స్టైలస్‌తో వస్తున్న వన్‌ప్లస్ ప్యాడ్ కేవలం వైఫై మీద మాత్రమే పనిచేస్తుంది. ఇందులో సిమ్ సదుపాయం లేదు. వన్‌ప్లస్ ప్యాడ్ రెండు వేరియంట్లలో మాత్రమే రిలీజ్ అవుతుంది. 8జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ. 37,999గా ఉంది. 12జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ. 39,999గా ఉంది. హాలో గ్రీన్ కలర్లో మాత్రమే ఈ ట్యాబ్ లభ్యమవుతుంది. 2023 ఏప్రిల్ 28 నుంచి వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో దీన్ని ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ. 2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్‌బీఐ, సిటీ, వన్ కార్డులపై ఒక సంవత్సరం వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ అద్భుత స్పెసిఫికేషన్స్‌ను కలిగి ఉంది. ఇందులో 11.61 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు. 144Hz రీఫ్రెష్ రేటుతో ఈ డిస్‌ప్లే పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్‌సిటీ 9000 ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13తో ఇది పనిచేస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, క్వాడ్ స్పీకర్ సెటప్ ఇందులో ఉన్నాయి.
వన్‌ప్లస్ ప్యాడ్ వెనుక వైపు 13 ఎంపీ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 9,510 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67W సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్ బరువు దాదాపుగా 550 గ్రాములు ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌తో పాటు మాగ్నటిక్ కీ బోర్డు, స్టైలస్ కొనుగోలు చేయొచ్చు. అయితే వీటికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Tamannaah Bhatia Pics: అసలే మిల్కి బ్యూటీ.. అందులోనూ వైట్ డ్రెస్! తమన్నా భాటియా అందం వేరే లెవల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.