OnePlus Pad Pro: భారత మార్కెట్‌లో రాను రాను టాబ్లెట్స్‌కి కూడా డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు అసక్తి చూపుతున్నారు. చాలా మంది అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ కలిగిన ప్యాడ్ టాబ్లెట్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో ట్యాబ్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ఇటీవలే చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన ట్యాబ్స్‌ విక్రయాలు జోరుగా పెరగడం వల్ల కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వన్‌ప్లస్ ప్యాడ్ ప్రో పేరుతో కొత్త టాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ OnePlus Pad Pro ట్యాబ్‌కి సంబంధించిన లీక్‌ వివరాలను టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పటికే ఈ ట్యాబ్‌కి సంబంధించిన ఫోటోస్‌చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో చాలా సార్లు కనిపించాయి. లీక్‌ అయిన ఫోటోల వివరాల ప్రకారం.. ఈ ట్యాబ్‌ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ప్రీమియం ఆల్-మెటల్ బాడీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చూడడానికి ఎంతో ప్రీమియం లుక్‌లో కనిపించడమే కాకుండా రేర్‌ కలర్స్‌లో విడుదల కాబోతోంది. 


OnePlus Pad Pro స్పెసిఫికేషన్స్‌:
ఈ ప్రీమియం OnePlus ట్యాబ్‌ అద్భుతమైన 12.1-అంగుళాల LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇది 3K రిజల్యూషన్‌తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని కలిగి ఉంటుంది. దీంతో పాటు డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్‌ కూడా చేస్తుంది. అయితే కంపెనీ ఈ ట్యాబ్‌ను ముందుగా నాలుగు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇందులో బేస్‌ వేరియంట్‌ 16GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో రాబోతోంది. అంతేకాకుండా ఈ ట్యాబ్‌  Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌పై రన్‌ కాబోతోంది. దీంతో పాటు ఈ ట్యాబ్‌ ఎంతో శక్తివంతమైన 8510mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


టిప్‌స్టర్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ చేసిన వివరాల ప్రకారం, ఈ స్మార్మ్‌ ట్యాబ్‌ నాలుగు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజ్‌, రెండవది 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌.. మూడవ వేరియంట్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇక టాప్‌ఎండ్‌ మోడల్‌ 16GB ర్యామ్‌, 512GB స్టోరేజ్‌ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే, 13MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఫ్రంట్‌లో  8MP సెల్ఫీ కెమెరా సెటప్‌తో రాబోతోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి