Oppo A2 Pro 5G Price: ఒప్పో తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. కంపెనీ త్వరలోనే మార్కెట్‌లోకి A సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌, తక్కువ బడ్జెట్‌లో రాబోతోందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌ను Oppo A2 Pro 5G పేరుతో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసింది. Oppo A2 Pro 5G మొబైల్‌ సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఒప్పో ఈ మొబైల్స్‌ను మూడు కలర్‌ వేరియంట్స్‌లో విడుదల చేయబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Oppo A2 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌లు గరిష్టంగా 12 GB RAM, 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో రాబోతోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ను చైనా విడుదల చేసింది. ఈ మొబైల్‌ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో ధర 2,099 యువాన్లు (సుమారు రూ. 24,200) లభిస్తోంది. అయితే కంపెనీ భారత్‌లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించబోతోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ ఇటీవలే విడుదల చేసిన మిడ్‌ మొబైల్స్‌పై పోటీ పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయంటున్నారు టెక్‌ నిపుణులు..


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


Oppo A2 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌:
ఈ Oppo A2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో పాటు ఆక్టా-కోర్ MT6877TT చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా డైమెన్షన్ 7050 ప్రాసెసర్‌తో రాబోతోంది. ఫోటోగ్రఫీ కోసం..64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీకోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రాబోతోంది. దీంతో పాటు LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. 


ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌:
6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
5000mAh బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
ఆండ్రాయిడ్ 13
190 గ్రాములు బరువు


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి