Oppo K12X 5G Discount Offer: అత్యధిక తగ్గింపుతో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన ఒప్పో స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను దృష్టిలో పెట్టుకొని ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని మొబైల్ పై ఇప్పటికే డిస్కౌంట్ ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపుతో పాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా ఇటీవలే ఒప్పో విడుదల చేసిన OPPO K12x 5G స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. దీనిపై మరింత తగ్గింపు పొందడానికి కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు, స్పెసిఫికేషన్ ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అత్యంత తగ్గింపు ధరతో OPPO K12x 5G స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన డీల్ లో భాగంగా దీనిని కొనుగోలు చేస్తే ఏకంగా 23% కంటే ఎక్కువగా తగ్గింపు లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లతో పాటు మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ పై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్కెట్లో రూ.16,999లకు విక్రయిస్తోంది. అయితే దీనిని 23% డిస్కౌంట్తో కేవలం రూ.12,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 


ఇక ఈ OPPO K12x 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే.. ఈ మొబైల్ ని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే.. దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను EMI ఆప్షన్ తో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం గా భావించవచ్చు. ఈ మొబైల్‌ని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి EMI ఆప్షన్ చూజ్ చేసుకుంటే దాదాపు మూడు నెలల పాటు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా అద్భుతమైన ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ముందుగా మీరు గతంలో వినియోగించిన స్మార్ట్ ఫోన్ లేదా వినియోగిస్తున్న మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌కు ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా చేస్తే దాదాపు రూ.7,000 పైగా డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది స్మార్ట్ ఫోన్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. పాత మొబైల్ కండిషన్ బ్రాండ్ మంచిదైతే పై డిస్కౌంట్ పొందవచ్చు. లేదంటే డిస్కౌంట్ తగ్గి మొబైల్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్ అన్నీ పోను  OPPO K12x 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.5,999కే పొందవచ్చు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.