Poco C51 Price Cut: తక్కువ ధరలోనే స్టోరేజ్‌ అధికంగా ఉండే మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌ కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. హోలీ సందర్భంగా రెడ్‌మీ, రియల్‌ మీ, పోకో ఇతర చైనీస్‌ బ్రాండ్‌ మొబైల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ సేల్‌లో కొన్ని ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌పై సంబంధించిన పరికరాలు చాలా తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై దాదాపు 25 నుంచి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇటీవలే మార్కెట్‌లో లాంచ్‌ అయిన POCO C51 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌    పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అమెజాన్‌ POCO C51 స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‌లో 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ MRP ధర రూ.10,999లతో లభిస్తోంది. అయితే హోలీ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా POCO C51 స్మార్ట్‌ఫోన్‌ 45 శాతం తగ్గింపుతో రూ.5,999లకే లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైలక్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 


బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా POCO C51 మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో Bandhan బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను రూ.5,400కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీని కోసం పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.5,650 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ.349కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పోకో C51 స్మార్ట్‌ఫోన్‌ టాప్ ఫీచర్స్‌
1. 6.52 అంగుళాల డిప్ల్పే HD+ 120Hz డిస్‌ప్లే:

ఈ ఫోన్‌ 6.52 అంగుళాల డిప్ల్పే పరిమాణంలో హై-డెఫినిషన్‌ (HD+) డిస్‌ప్లేని కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది, దీని వలన స్మూత్ స్క్రోలింగ్, స్క్రీన్ అనుభవం లభిస్తుంది.


2. 5000mAh బ్యాటరీ:
పోకో C51లో 5000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీతో లభిస్తోంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే సుదీర్ఘకాలం పాటు పనిచేస్తుంది.


3. 8MP డ్యూయల్ రియర్ కెమెరా:
ఈ ఫోన్ లో 8MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


4. 5MP సెల్ఫీ కెమెరా:
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP సెల్ఫీ కెమెరా


5. మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్:
ఈ ఫోన్‌ మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది మంచి గేమింగ్, మల్టీటాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది.


6. 4GB RAM + 64GB స్టోరేజ్:
4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది.


7. Android 13 (Go Edition):
Android 13 (Go Edition) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది తక్కువ ర్యామ్‌ ఉన్న ఫోన్‌లలో మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి