Poco M4 Pro 5g Phone only for 12,999: 12,999కే పోకో ఎం4 ప్రో 5జీ..ఎక్కడ కొనాలో తెలుసా?
Poco M4 Pro 5g Phone Lowest Rate: ఫ్లిప్ కార్ట్ తాజా ఎలక్ట్రానిక్స్ సేల్‌లో, Poco యొక్క 5G స్మార్ట్‌ఫోన్ M4 5Gని 25% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ ఫోన్‌పై కంపెనీ రూ.1500 బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్ఇతోంది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
Poco M4 Pro 5g Phone: మీరు ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అది కూడా తక్కువ ధరలో ఒక మంచి ఫోన్‌ను కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్టు అయితే ఈ వార్త ప్రత్యేకంగా మీ కోసమీ చదివేయండి. అసలు విషయం ఏమిటంటే POCO M4 Pro అనేది ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్. ఇక ఇప్పుడు ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఫోన్ తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అనేక అద్భుతమైన ఫీచర్లను కూడా అందిస్తుంది. కాబట్టి POCO M4 Pro 5G మరియు దానిపై అందుబాటులో ఉన్న Flipkart డీల్స్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక POCO M4 Pro 5G యొక్క 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో మీకు అందుబాటులోకి వచ్చింది. ఇక నిజానికి స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 21,999 అయినప్పటికీ, 27% తగ్గింపు పొందిన తరువాత, దాని ధర 15,999 మాత్రమే ఉండనుంది. ఇక బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఈ ఫోన్ మీద ఉన్నాయి. మీరు ఈ ఫోన్ ను కనుక Flipkart Axis బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల సహాయంతో ఫోన్ కొనుగోలు చేస్తే, రూ.750 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది.
ఇక మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా తక్కువ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు. POCO M4 Pro 5Gని కొనుగోలు చేయడానికి మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మీరు రూ. 15,100 వరకు ఆదా చేసుకోవచ్చు, అయితే అది మీ మునుపటి ఫోన్ పరిస్థితి ఆధారంగా ఉంటుంది. ఇక కంపెనీ హ్యాండ్‌సెట్‌కు ఒక సంవత్సరం వారంటీని మరియు ఉపకరణాలకు 6 నెలల వారంటీ కూడా అందిస్తోంది. POCO M4 Pro 5G యొక్క 4GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 12,999 కే లభిస్తోంది.
POCO M4 Pro 5G స్పెసిఫికేషన్లు:
ఈ Poco స్మార్ట్‌ఫోన్‌లో, మీరు 6.6-అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను పొందుతారు. ఇక ఈ ఫోన్కి 50 MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీ సహా వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇక హ్యాండ్‌సెట్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మెరుగైన వేగం కోసం, ఫోన్‌లో MediaTek Dimension 810 ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు.
Also Read: Rocking Rakesh Marriage: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు.. ఇక అఫీషియల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook