COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo Y200 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ వీవో నుంచి త్వరలోనే కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు టిప్‌స్టర్స్‌ తెలిపారు. దీనిని కంపెనీ Vivo Y200 Pro 5G పేరుతో విడుదల కాబోతోంది. గతంలో లాంచ్‌ చేసిన Y200 5G, Y200e స్మార్ట్‌ఫోన్స్‌కి సక్సెసర్‌గా ఈ మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. వీటిని దృష్టిలో పెట్టుకుని Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అతి త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు టిప్‌స్టర్స్‌ తెలిపారు. 


ఈ Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, బీఐఎస్ లిస్టింగ్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ AMOLED కర్వ్ ఎడ్జ్ డిజైన్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది 6.78 అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్‌తో లభించబోతోంది. అంతేకాకుండా ఇది డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో రాబోతోంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. అలాగే ఈ మొబైల్‌ను కంపెనీ  8GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో  LED ఫ్లాష్‌తో కూడిన త్రిపుల్‌ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. 


దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 64-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరాతో రాబోతోంది. దీంతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్‌తో పాటు 5000mAh బ్యాటరీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు భద్రత ఫీచర్స్‌లో భాగంగా ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇతర శక్తివంతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


వివో Y200 ప్రో స్మార్ట్‌ఫోన్‌ టాప్ 10 ఫీచర్స్:
90Hz రిఫ్రెష్ రేట్, 1300 nits పీక్ బ్రైట్‌నెస్‌తో స్పష్టమైన, ప్రకాశవంతమైన డిస్ప్లే 6.62-అంగుళాల AMOLED డిస్ప్లే
శక్తివంతమైన పనితీరు కోసం 7nm ప్రాసెస్ టెక్నాలజీతో 5G SoC Snapdragon 870 ప్రాసెసర్.
అద్భుతమైన ఫోటోలు, వీడియోల కోసం ప్రధాన కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, మాక్రో కెమెరా 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్‌ను 16MP సెల్ఫీ కెమెరాతో పొందవచ్చు
80W ఫ్లాష్‌ఛార్జ్‌తో  పాటు ఉండే బ్యాటరీ 4040mAh బ్యాటరీ
తాజా Google ఫీచర్‌లతో Android 12
గేమింగ్, ఇతర డిమాండ్‌లను పెంచడానికి Vivo Multi-Turbo 5.0
అద్భుతమైన ఆడియో అనుభవం Hi-Res Audio
వేగవంతమైన, సురక్షితమైన In-Display ఫింగర్‌ప్రింట్ సెన్సార్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి