COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo S19 - Vivo S19 Pro: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Vivo విడుదల చేసిన S సిరీస్‌ మొబైల్స్‌కి మార్కెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతంలో ఈ కంపెనీ లాంచ్‌ చేసిన Vivo S18 సిరీస్‌కు మంచి ప్రజాదరణ లభించింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మరో S సిరీస్‌ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన కెమెరాతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా కంపెనీ దీనిని Vivo S19 సిరీస్‌ పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. కంపెనీ ఈ సిరీస్‌ను Vivo S19, Vivo S19 ప్రో అనే రెండు మోడల్స్‌లో మార్కెట్‌లో లాంచ్‌ కాబోతోంది. అలాగే ఇదే సమయంలో వీవో కంపెనీ  Vivo Watch GT స్మార్ట్‌వాచ్‌ను  కూడా విడుదల చేయబోతోంది. ఇది కూడా ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌తో పాటు స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


Vivo S19 సిరీస్ విడుదల తేది:
వివో కంపెనీ S19 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను మొదట చైనాలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని మే 30న రాత్రి 7 గంటలకు ప్రారంభించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ సిరీస్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో  ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌ కూడా లభిస్తోంది. ఈ మొబైల్స్ వెనక భాగంలో త్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది.


వీవో వాచ్ జీటీ స్క్వేర్ డయల్‌ ఫీచర్స్‌:
Vivo S19 సిరీస్‌తో పాటు వీవో వాచ్ జీటీ స్క్వేర్ డయల్‌ స్మార్ట్‌వాచ్‌ కూడా లాంచ్‌ కాబోతోంది. ఇది పూర్తిగా అల్యూమినియం బాడీతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌వాచ్‌ 1.69-అంగుళాల AMOLED డిస్ప్లే కలిగి  ఉంటుంది. అలాగే ఇందులో  ఫిట్‌నెస్ ట్రాకింగ్ సెటప్‌ అయిన మీ స్టెప్స్, హార్ట్ రేట్, కేలరీలు బర్న్ వంటి ఫీచర్స్‌తో వస్తోంది. అంతేకాకుండా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తుంది. ఇది ఫోన్ నుంచి నోటిఫికేషన్స్‌, కాల్‌లు, టెక్స్ట్‌లను కూడా వ్యూ చేస్తుంది. దీంతో పాటు వేదర్‌ రిపోర్ట్‌ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనిని ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే, 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


Vivo S19 Pro లీక్‌ అయిన ఫీచర్స్‌:
త్రిపుల్ కెమెరా సెటప్‌
50 మెగాపిక్సెల్ Sony IMX921 ప్రధాన కెమెరా
 50 మెగాపిక్సెల్  కెమెరా
Sony టెలిఫోటో పోర్ట్రెయిట్ సెన్సార్స్‌
పూర్తి-ఫోకస్ పోర్ట్రెయిట్ కెమెరా
6.78-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే
స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
6000mAh బ్యాటరీ 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి