COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Promate Xwatch S19 Smartwatch: క్రమంగా స్మార్ట్ వాచ్‌ల వినియోగం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం యువత తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలిగిన స్మార్ట్ వాచ్‌లను కొనుగోలు చేసేందుకు మగ్గుచూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పలుటెక్ కంపెనీలు స్మార్ట్ వాచ్ ల తయారీకి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే సాధారణ బడ్జెట్లో లభిస్తున్నాయి. అతి తక్కువ ధరతో కొనుగోలు చేయాలనుకునే వారికోసం ఇటీవలే ఓ టెక్ కంపెనీ సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్న ఫీచర్స్ ఏంటో, ఎంత బడ్జెట్లో లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


XWatch-B2 పేరుతో స్మార్ట్‌వాచ్ విడుదలైంది. ఈ స్మార్ట్ వాచ్‌లో వన్ ప్లస్, రియల్ మీ వాచ్ ల్లో ఉన్న కొత్త ఫీచర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ వాచ్ వివరాల్లోకి వెళితే..2.01 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 240×296 పిక్సెల్ రిజల్యూషన్ తో 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కు సపోర్ట్ చేస్తుంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్ ఈ స్మార్ట్ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి.


ఒక్కరోజు చాట్ చేస్తే 15 రోజుల వరకు బ్యాటరీ లైవ్:
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ వాచ్‌లు కేవలం రెండు రోజులు వరకు మాత్రమే బ్యాటరీ లైఫ్ అందించేవి.. కానీ XWatch-B2 స్మార్ట్ వాచ్ ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 10 నుంచి 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ ఖచ్చితమైన రన్నింగ్ ట్రాకింగ్‌తో పాటు సైక్లింగ్, యోగ ట్రాకింగ్లను కూడా కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌వాచ్ 123 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది.


ధరెంతో తెలుసా?:
ప్రస్తుతం ఈ Promate XWatch-B2 స్మార్ట్ వాచ్ అమెజాన్‌లో రెండు కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మొదట కంపెనీ ఈ స్మార్ట్ వాచ్ ను MRP రూ. 4, 500కు విక్రయించగా..దివాళి ప్రత్యేక ఆఫర్లలో భాగంగా ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ రూ.2,499కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ వాచ్ పై అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దీని కోసం మీరు అధికారిక అమెజాన్ వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది.


స్మార్ట్ ఫీచర్‌ ఇవే:
బ్లూటూత్ 5.2 సపోర్ట్‌
మైక్రోఫోన్, స్పీకర్‌
యాక్టివ్ లైఫ్ హెల్త్ సూట్‌
పెడోమీటర్
హార్ట్‌ రేట్‌ సెన్సార్‌
స్లీపింగ్‌ ట్రాకింగ్‌
వాటర్ రెసిస్టెంట్


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook