RBI: బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. ఇక నుంచి మరింత సింపుల్..!
Reserve Bank Of India News: ఇక నుంచి డెబిట్ కార్డు లేకుండా క్యాష్ డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించనుంది. యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Reserve Bank Of India News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ప్రస్తుతం క్యాష్ డిపాజిట్ మెషీన్లలో డెబిట్ కార్డు ద్వారా మాత్రమే డబ్బులు డిపాజిట్ చేసే సౌకర్యం ఉందని.. కార్డ్ లెస్ లావాదేవీ మాదిరిగా భవిష్యత్తులో యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసేలా మార్పులు చేస్తామన్నారు. దీని ద్వారా ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) విధాన ప్రకటనలో భాగంగా శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు. ఎంపీసీ పాలసీ సమావేశంలో కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది.
డిపాజిట్ మెషీన్లలో డబ్బును డిపాజిట్ చేయడానికి డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. డెబిట్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబరు ద్వారా డిపాజిట్ చేయవచ్చు. ఇక నుంచి యూపీఐ ద్వారా కూడా డిపాజిట్ చేసే సౌకర్యాన్ని ఆర్‌బీఐ తీసుకురానుంది. దీంతో కస్టమర్లకు పనులు మరింత సులభతరం అవుతాయని.. బ్యాంకుల్లో కరెన్సీ నిర్వహణ ప్రక్రియ మరింత సమర్ధవంతంగా సాగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నారు.
బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ యంత్రాల వినియోగంతో వినియోగదారుల సౌలభ్యం పెరిగింది. అదే సమయంలో బ్యాంకు శాఖల్లో నగదు డిపాజిట్‌పై ఒత్తిడి తగ్గింది. ప్రస్తుతం ఎక్కువ పేమెంట్స్ యూపీఐ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో కార్డు లెస్ డిపాజిట్స్‌పై ఆర్‌బీఐ ఫోకస్ పెట్టింది. యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని ప్రతిపాదించింది.
యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం స్క్రీన్‌పై "UPI కార్డ్‌లెస్ క్యాష్" విత్ డ్రా ఆప్షన్‌ను ఎంచుకున్న తరువాత.. మీకు కావాల్సిన అమౌంట్‌ను ఎంటర్ చేయండి. స్క్రీన్‌పై వన్ టైమ్ డైనమిక్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ని ఉపయోగించి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత.. నగదును స్వీకరించడానికి మీ యూపీఐ పిన్‌తో లావాదేవీకి పర్మిషన్ ఇవ్వండి. ప్రస్తుతం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) జారీ చేసేవారు అందించిన వెబ్ లేదా మొబైల్ యాప్‌ని ఉపయోగించి మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఇక నుంచి పీపీఐ వాలెట్స్ నుంచి యూపీఐ చెల్లింపులు చేయడానికి థర్డ్ పార్టీ యూపీఐ యాప్‌ల వినియోగాన్ని అనుమతించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన
Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook