Realme 11X Price: ప్రముఖ చైనీస్‌ టెక్‌ కంపెనీ రియల్‌ మీకి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్త కొత్త సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తుంది. Realme ఇటీవలే విడుదల చేసిన Realme 11x 5G స్మార్ట్ ఫోన్‌ తక్కవ ధరలో ఎక్కువ ఫీచర్స్‌తో లభించడం వల్ల మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ప్రత్యేక డిస్కౌంట్‌తో అందించబోతోంది. ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ సేల్‌ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో Realme 11x 5G మొబైల్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ సేల్‌ ప్రారంభం కాబోతోంది. ఈ మొబైల్‌ ప్రస్తుతం కంపెనీ ఫ్లిప్‌లో రూ.16,999లకు విక్రయిస్తోంది. అయితే సాధరణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఫ్లిప్‌కార్ట్‌ 11 శాతం తగ్గింపును అందించింది. దీంతో ఈ మొబైల్‌ ఫోన్‌ రూ. 14,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ Realme 11x 5G స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.


మీరు ఈ మొబైల్‌ ఫోన్‌ను మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అంతేకాకుండా రూ.2000 వరకు అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో పాటు మూడు నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఒక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ. 13,999లకే పొందవచ్చు. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ మిడ్‌నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. Realme 11x 5G స్మార్ట్‌ ఫోన్‌ 64MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ గరిష్టంగా 8GB ర్యామ్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇది MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. డైనమిక్ RAM ఫీచర్‌తో 8GB అదనపు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కూడా ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌లో అనేక రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.  


Realme 11x 5G స్పెసిఫికేషన్‌లు 
❀ 6.72 అంగుళాల పూర్తి HD + LCD డిస్‌ప్లే
❀ 120Hz రిఫ్రెష్ రేట్‌
❀ MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌
❀ RealmeUI సాఫ్ట్‌వేర్ స్కిన్
❀ Android 13 
❀ డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్‌
❀ 64MP ప్రైమరీ కెమెరా లెన్స్‌
❀ 2MP పోర్ట్రెయిట్ కెమెరా
❀ సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరా
❀ 5000mAh బ్యాటరీ
❀ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి