Realme C53 Price: ప్రముఖ టెక్‌ కంపెనీ  Realme మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. Realme తమ మొబైల్‌ ఫోన్‌ను C53 సిరీస్‌ పేరుతో లాంచ్‌ కాబోతోంది. ఈ నెల 19వ తేదిన భారతదేశ వ్యాప్తంగా కంపెనీ విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఐఫోన్ లాంటి డిజైన్‌ని కలిగి ఉండబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌ ఫోన్‌ మలేషియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో కంపెనీ రూపొందించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో చాలా రకాల ఫీచర్స్‌ ఉన్నాయి. అయితే దీని సంబంధించిన ఫీచర్స్‌ ఏంటో, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme C53 స్పెసిఫికేషన్స్‌:
ఈ మొబైల్‌ ఫోన్‌ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో విడుదల చేయబోతోందని కంపెనీ రివీల్‌ చేసింది. ఇక కెమెరా వివరాల్లోకి వెళితే..108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో రాబోతోంది. అంతేకాకుండా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా వివరించలేదు. మలేషియాలో విడుదల చేసిన ఈ Realme C53 వేరియంట్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ కలిగి ఉంది.


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


మలేషియాలో వార్త సంస్థలు వివరించిన సమాచారం ప్రకారం..మలేషియాలో ప్రవేశపెట్టిన ఫీచర్స్‌ కలిన Realme C53 స్మార్ట్‌ ఫోన్‌నే భారత్‌లో కూడా విడుదల చేయబోతుందని ప్రముఖ టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్లిమ్‌ బాడీతో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లే, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా భారత్‌లో 6 GB ర్యామ్‌ వేరియంట్స్‌తో పాటు 8GB వేరియంట్‌ను కూడా విడుదల చేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI T ఎడిషన్‌తో రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు  స్టోరేజీని 2TB వరకు పెంచుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. 


ఇక బ్యాటరీ ప్యాకప్‌ విషయానికొస్తే..ఈ మొబైల్‌ ఫోన్‌ 33W వైర్డు SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. అంతేకాకుండా  GPS, NFC, WiFi, USB టైప్-C, బ్లూటూత్ v5.0 కనెక్టివిటీల సపోర్ట్‌ ఆప్షన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు లభించబోతున్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్టులో 19వ తేదిన విడుదల కాబోతోంది. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook