కొత్త ఏడాది 2023లో రియల్‌మి కంపెనీ కస్టమర్లలో ఆసక్తి, ఆతృత పెంచుతోంది. ఇండియాలో ఇటీవలే రియల్‌మి 10 సిరీస్ లాంచ్ చేసింది. ఇందులో ఇప్పటికే 5 జీ స్మార్ట్‌ఫోన్లు ఉంటే కొత్తగా 4జీ చేర్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో రియల్‌మి ఇటీవలే Realme 10 4G లాంచ్ చేసింది. ఇందులో 90 హెర్ట్జ్ ఎమోల్డ్ డిస్‌‌ప్లేతో పాటు హెలియో జి99 చిప్‌సెట్ , 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఉంది. ఇండియాలో ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవల్సిందే. ఆ వివరాలు మీ కోసం..


Realme 10 4G ఇండియాలో ధర


Realme 10 4G స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 13,999 రూపాయలు. అదే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 16,999 రూపాయలుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై వేలరూపాయలు ఇంట్రోడక్టరీ ఆఫర్ లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు, సిటి బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు 12,999 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను realme.com, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.


Realme 10 4G ప్రత్యేకతలు


రియల్‌మి 10 4జిలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.4 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా నడుస్తుంది. ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో జి99 ద్వారా నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ వరకూ ర్యామ్, 128 జీబీ వరకూ స్టోరేజ్ సౌలభ్యం ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.


Realme 10 4G కెమేరా, బ్యాటరీ


రియల్ మి 10 4జిలో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ ఉన్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ మరో ప్రత్యేకత. ఇది కాకుండా ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్ ఉన్నాయి. బ్యాటరీ విషయంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉండటమే కాకుండా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యముంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, రష్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 


Also read: Flipkart smartphone offers: 32 జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 549 రూపాయలే, త్వరపడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook