Realme Narzo 70X 5G Price: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌కి భారత మార్కెట్‌లో రోజురోజుకు డిమాండ్‌ పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఎప్పకప్పుడు కొత్త కొత్త మొబైల్స్‌ను తయారు చేస్తూ విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్‌మీతో పాటు రియల్‌ మీ లాంటి కంపెనీలు ప్రతి ఏడాది వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ఎప్పటి నుంచో మీరు కూడా అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన రియల్‌ మీ స్మార్ట్‌ఫోన్స్‌ను డెడ్‌ చీప్‌ ధరకే అందిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Realme Narzo 70X 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఇది నాలుగు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. బేస్‌ వేరియంట్‌ 6 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మొబైల్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ M.R.P ధర రూ. 17,999కు విక్రయిస్తోంది. అయితే అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్‌లో కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను దీనిని కేవలం రూ.13,499కే పొందవచ్చు. 


అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ కూపన్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి మరింత తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే అమెజాన్‌ ఈ కూపన్‌ను అప్లై చేసేవారికి రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.11,999కే పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని సెలక్టెడ్‌ బ్యాంకులపై నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. 


అంతేకాకుండా ఈ Realme Narzo 70X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 12,800 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఎక్చేంజ్‌ బోనస్‌ పోను ఈ కొత్త మొబైల్‌ కేవలం రూ.699కే లభిస్తుంది. ఈ మొబైల్‌పై అమెజాన్‌ ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 
 
రియల్‌ మీ నార్డో 70ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఫీచర్స్‌:
డైమెన్సిటీ 6100+ 5G ప్రాసెసర్
120Hz స్మూత్ డిస్ప్లే
6.6-అంగుళాల FHD+ డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌ డిస్ప్లే
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా
50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
2MP మాక్రో లెన్స్ కెమెరా
2MP డెప్త్ సెన్సార్‌ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
రియర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్ స్పీకర్లు
3.5mm హెడ్‌ఫోన్ జాక్
హై-రెజల్యూషన్ ఆడియో


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌:
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్
Realme UI 3.0 స్కిన్
4GB/6GB RAM
64GB/128GB స్టోరేజ్
5G కనెక్టివిటీ


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి