COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Narzo Sale: అతి తక్కువ ధరలోనే ప్రీమియం సెగ్మెంట్‌లో లభించే స్మార్ట్‌ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా రీయల్ మీ కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన 5G మొబైల్స్‌ విక్రయాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీ తమ అధికారి వెబ్‌సైట్‌లో నార్జో వీక్‌ సేల్స్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా నార్జో సిరీస్‌కు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. మార్కెట్‌లో ఇటీవలే విడుదలైన Realme Narzo 60, Realme Narzo N55, Realme Narzo N53పై ప్రత్యేక తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ నార్జో సేల్‌ నవంబర్ 22వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమై నవంబర్ 30న ముగుస్తుంది. అయితే ఈ సేల్‌ అమోజాన్‌తో పాటు రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రత్యేక సేల్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రస్తుతం మార్కెట్‌లో రియల్‌ మీ నార్జో 60 ప్రో 5G స్మార్ట్ ఫోన్‌ 12GB+1TB, 2GB+256GBతో పాటు 8GB+128GB వేరియంట్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం రియల్‌ మీ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో 8GB+128GB వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ MRP ధర రూ. 23,999 కాగా..ప్రత్యేక నార్జో సేల్‌లో భాగంగా ఈ realme narzo 60 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ రూ.19,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 4,000 గల ప్రత్యేక కూపన్‌ కూడా అందుబాటులో ఉంది. 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


అంతేకాకుండా ఈ realme narzo 60 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్స్‌ అమోజాన్‌తో పాటు రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా Realme narzo 60 5Gపై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. మీరు అతి తక్కువ ధరలోనే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ Realme narzo 60 5G స్మార్ట్ ఫోన్‌పై రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 2,000 వరకు తగ్గింపు కూపన్‌ కూడా లభిస్తోంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.17,999కే కొనుగోలు చేయోచ్చు. 


దీంతో పాటు Amazon, realme.in అధికారిక వెబ్‌సైట్స్‌లో నార్జో వీక్‌ సేల్‌లో భాగంగా Realme narzo N55 (6GB+128GB) మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారికి రియల్‌ మీ రూ. 3000 తగ్గింపు కూపన్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ MRP రూ.12,999తో అందుబాటులో ఉండగా..ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ కేవలం రూ.9,999కే అందుబాటులో ఉంది. 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook