Redmi 13 Note Pro Price: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో Redmi Note 13 Pro+ మొబైల్..ఫైనల్ ధర, ఫీచర్స్ లీక్..
Redmi 13 Note Pro Price In India: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Redmi Note 13 Pro+ స్మార్ట్‌ఫోన్ జనవరి 4న మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, ధరను విడుదలకు ముందే ఓ టిప్‌స్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Redmi 13 Note Pro Price In India: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Redmi Note 13 సిరీస్‌లు చైనాలో విడుదలయ్యాయి. ప్రముఖ Xiaomi(షావోమీ) కంపెనీ జనవరి 4న భారత్‌లో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్ మీ మొత్తం మూడు స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5Gతో పాటు Redmi Note 13 Pro+ 5Gను కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మూడు మొబైల్స్ టాప్ ఎండ్ వేరియంట్ రెడ్‌మి నోట్ 13 ప్రో+ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్ విడుదల కంటే ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతదేశంలో విడుదల కాబోయే Redmi Note 13 Pro+ రిటైల్ బాక్స్ ఫోటోలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ మొబైల్ 12GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్‌లో రాబోతోందని తెలుస్తోంది. ఈ వేరియంట్ గరిష్ట రిటైల్ ధర (MRP) రూ. 37,999 ఉండబోతున్నట్లు ఫోస్ట్ ద్వారా తెలుస్తోంది. మార్కెట్‌లోకి విడుదలైతే బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా రూ.2000 వరకు తగ్గే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మొదట ఈ మొబైల్‌ను రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం..
Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
లీకైన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్ ఫోన్ ఫ్యూజన్ వైట్, ఫ్యూజన్ పర్పుల్ , ఫ్యూజన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో రాబోతోంది. ఈ Redmi Note 13 Pro+ మొబైల్ 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 7200 SoC, 200MP అల్ట్రా హై రెస్ కెమెరా సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే 5000mAh బ్యాటరీ, 120W హైపర్‌ఛార్జ్, IP68 రేటింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. డిస్‌ప్లే ప్రోటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను కూడా అందిస్తోంది.
బాక్స్ లోపల 120W అడాప్టర్‌తో పాటు కెబుల్ ఉంటుందని సమాచారం. అలాగే ఈ Redmi Note 13 Pro+ మొబైల్ 19 నిమిషాల్లో 0-100 శాతం నుంచి ఛార్జ్ చేయగలదని కూడా కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు Dolby Vision Atmos సపోర్ట్‌తో కూడిన అతి శక్తివంతమైన 1.5K 10+2 బిట్ ప్యానెల్‌తో డిస్‌ప్లేతో రాబోతున్నట్లు తెలస్తోంది. ఈ మొబైల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం..రెడ్‌మి నోట్ 13 ప్రో+లో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది.
Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter