COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi 13C Price: రెడ్‌మీ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. ఈ మొబైల్‌ను రెడ్‌మీ 13సి(Redmi 13C) పేరుతో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ Redmi 13C స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ రెడ్‌మీ 13సి(Redmi 13C) స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


నాలుగు కలర్ ఆప్షన్లలో Redmi 13C:
ఇటీవలే కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్ ఫోన్‌ థిక్ చిన్, టాప్ బెజెల్స్‌తో రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్‌  వాటర్‌డ్రాప్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి విడుదలైతే మొత్తం నాలుగు కలర్స్‌ ఫోన్ బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, లైట్ బ్లూ ఆప్షన్‌లలో లభించనుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ చాలా రకాల కొత్త ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, విడుదల తేదికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అతి త్వరలోనే Redmi 13C మొబైల్‌కి సంబంధించిన సమాచారాన్ని రెడ్‌ మీ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రముఖ టిప్‌స్టార్స్‌ అభిప్రాయపడుతున్నారు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


ఫీచర్లు,స్పెసిఫికేషన్‌:
Redmi 13C ఫీచర్లు,స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఫుల్ హెచ్‌డి+ రిజల్యూషన్‌తో కూడిన 6.59 అంగుళాల ఐపిఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ వెనుక ప్యానెల్ ప్లాస్టిక్‌తో రాబోతోంది. Redmi 13Cని కంపెనీ మొదట 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లాంచ్‌ చేయబోతోంది. ఈ మొబైల్‌ MediaTek Helio G85 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. 


ఇతర స్పెసిఫికేషన్స్‌:
108 మెగాపిక్సెల్ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
MediaTek Helio G85 ప్రాసెసర్
LED ఫ్లాష్‌
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ
USB టైప్-సి సపోర్ట్‌


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook