Redme Note 13 Pro: 200MP కెమేరా 12GB ర్యామ్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ Redme Note 13 Pro ధర ఎంతంటే
Redme Note 13 Pro: స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఎవరైనా సరే ముందుగా చూసేది ర్యామ్, కెమేరా ఫీచర్లు ఎలా ఉన్నాయనేదే. ఈ రెండు ఫీచర్లతో దుమ్మురేపుతున్న ఫోన్ ఇది. రెడ్ మి నోట్ 13 ప్రో. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Redme Note 13 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్ మి గత ఏడాది లాంచ్ చేసిన Redme Note 13 Pro మార్కెట్‌లో దుమ్ము రేపుతోంది. శక్తివంతమైన కెమేరా, పవర్‌ఫుల్ ర్యామ్ కలిగి ఉండటమే ఇందుకు కారణం. మార్కెట్‌లో మరే ఇతర స్మార్ట్‌ఫోన్ ఈ ఫోన్ పీచర్ల ముందు సాటిరాదు.
Redme Note 13 Pro స్మార్ట్‌ఫోన్ 5జి టెక్నాలజీతో 6.67 అంగుళాల 1.5 కే కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో రిజల్యూషన్ అత్యద్భుతంగా ఉంటుంది. ఇక స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అమర్చింది కంపెనీ. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ అయితే బ్లూటూత్ 5.2, వైఫై 6 తో పనిచేస్తుంది. ఐపీ 54 రేటింగ్ కలిగిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
2023 జనవరిలో ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ తొలుత ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ రంగులో లభించేది. తాజాగా ఓలివ్ గ్రీన్ ఆవిష్కరించింది రెడ్ మి కంపెనీ. ఈ ఫోన్ మూడు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యమౌతోంది. Redme Note 13 Pro 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ధర 24,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 26,999 రూపాయలుగా ఉంది. ఇక ఇందులోనే 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 28,999 రూపాయలకు లభ్యమౌతోంది.
ఇక అన్నింటికంటే ప్రత్యేకం కెమేరా. ఏ ఇతర బ్రాండెడ్ ఫోన్‌లో లేని విధంగా ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంది. ఇది కాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా మరో విశేషం.
Also read: ITR Filing: ఆ పని చేయకపోతే మీ ఐటీ రిటర్న్స్ రిజెక్ట్ అవుతాయి జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook