Netflix With Jio Plans: దేశీయ ప్రైవేట్ టెలీకం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో బీఎస్ఎన్ఎల్ ఉంది. వీటన్నింటిలో అత్యధికంగా యూజర్లు కలిగింది రిలయన్స్ జియో. ఇప్పుడు జియో కొత్తగా అందిస్తున్న రెండు ప్లాన్స్‌తో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఐపీఎల్ 2024 నడుస్తోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు అన్నీ జియో సినిమా ఉచిత స్ట్రీమింగ్ అవుతున్నాయి. డేటా అంతరాయం లేకుండా ఉండేందుకు అతి తక్కువ ధరలో 15 రూపాయలు, 25 రూపాయలు, 29 రూపాయలకు డేటా రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. మరోవైపు కస్టమర్లను నిలబెట్టుకునేందుకు, కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్స్ ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో జియో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్స్‌తో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా పొందవచ్చు. 


జియో 1499 రూపాయల ప్లాన్


ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. 84 రోజులకు కలిపి మొత్తం 252 జీబీ డేటా అందుతుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు , అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉన్నాయి. అంతేకాకుండా జియో సినిమా సహా జియో యాప్స్ ఉచితంగా పొందవచ్చు. ఇవి కాకుండా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుతుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ వాస్తవానికి నెలకు 199 రూపాయలు అవుతుంది. అలాంటిది 1499 రూపాయల ప్లాన్‌తో 84 రోజులపాటు నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్‌లో లభించే నెట్‌ఫ్లిక్స్ కేవలం మొబైల్‌కే కాకుండా టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్ అన్నింట్లో యాక్సెస్ ఉంటుంది. 


జియో 1099 రూపాయల ప్లాన్


ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులుంటుంది. కానీ రోజుకు 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇందులో కూడా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన కాలింగ్ ఉంటాయి. వీటితో పాటు జియో సినిమా సహా అన్ని జియో యాప్స్ ఉచితంగా లభిస్తాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఎడిషన్ 84 రోజులపాటు ఉచితంగా లభిస్తుంది. 


Also read: Samsung Galaxy F15: 8జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ ఫోన్ కేవలం 14 వేలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook