Jio Postpaid Plans: జియో పోస్ట్‌పెయిడ్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హట్‌స్టార్ పూర్తిగా ఉచితం, ఎలాగంటే
Jio Postpaid Plans: ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలకు ప్రాచుర్యం పెరిగింది. అదే సమయంలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా పెరిగి భారంగా మారింది. అయితే కొన్ని ఓటీటీ వేదికల్ని ఏడాదిపాటు ఉచితంగా పొందే అవకాశం వస్తోంది. అదెలాగో చూద్దాం..
Jio Postpaid Plans: సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ప్రస్తుతం వెంటనే గుర్తొచ్చేది ఓటీటీ వేదికలే. అంతగా ప్రాచుర్యం పొందాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందే అద్భుతమైన అవకాశం ఉందిప్పుడు. అది కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూడు ఓటీటీల ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుకునేందుకు అద్భుతమైన ఆఫర్ ఇది. మీరు చేయాల్సిందల్లా జియో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకోవడమే. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుని ఒక ఫామ్ ఫిల్ చేస్తే..ఉచితంగా ఓటీటీ సౌలభ్యం అందుతుంది. జియో అందిస్తున్న ఆ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం..
జియో ప్లాన్ 399 పోస్ట్‌పెయిడ్‌లో ప్రతి నెలా 75 జీబీ డేటా ఉంటుంది. ఏదైనా నెట్‌వర్క్‌పై అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
ఇక మరో ప్లాన్ 599 రూపాయలది. ఇందులో 100 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటాయి. దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
799 రూపాయల పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో 150 జీబీ డేటా, 200 జీబీ రోలోవర్ డేటా ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ ప్లాన్. ఇందులో రెండు అడిషనల్ సిమ్ కార్డ్స్ ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి.
ఇక మరో ప్లాన్ కాస్త ఖరీదైంది. 999 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 200 జీబీ హైస్పీడ్ డేటా, 500 జీబీ రోలోవర్ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం లభిస్తుంది. ఇందులో మూడు సిమ్ కార్డ్స్ ఉంటాయి. ఈ ప్లాన్‌తో కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది మెంబర్‌షిప్ లభిస్తాయి.
Also read: Today Gold Rate: స్థిరంగా పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook