Samsung Galaxy A05 Price: భారీ డిస్కౌంట్ ఆఫర్స్..Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ రూ.8,999కే పొందండి..
Samsung Galaxy A05 Price: సాంసంగ్ నుంచి మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. సాంసంగ్ అధికారిక వెబ్సైగ్లో Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్ ఫోన్‌కి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy A05 Price: సాంసంగ్ ఇటీవలే మార్కెట్‌లో విడుదల చేసిన Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ Galaxy A05 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ ఫోన్ రెండు వేరియంట్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్ 4 GB + 64 GB అయితే రెండవ వేరియంట్ 6 GB + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. ప్రస్తుతం 4 GB RAM వేరియంట్ ధర రూ.9,999తో అందుబాటులో ఉంది.
మార్కెట్‌లో 6 GB RAM కలిగిన వేరియంట్ రూ. 12,499కు లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకునేవారు 4 GB RAM వేరియంట్ ధర రూ.9,999ను కొనుగోలు చేయోచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు అధికారిక వెబ్‌సైట్‌లో SBI క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం పరిమితకాలం మాత్రమే..దీంతో ఆఫర్స్ అన్ని పోను మీరు రూ. 8,999కే పొందవచ్చు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ కంపెనీ ఫోన్‌లో గరిష్టంగా 6 GB RAM, 128 GB వరకు అంతర్గత స్టోరేజ్‌తో అందిస్తోంది. ఈ మొబైల్ MediaTek G85 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఈ మొబైల్ 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇక సెల్ఫీకోసం ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ, 25 వాట్ల సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్‌తో రాబోతోంది. ఈ మొబైల్ నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్, రెండు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. మొత్తం ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ వేరియట్స్(లైట్ గ్రీన్, సిల్వర్, బ్లాక్లో లభిస్తోంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి