Samsung Galaxy A15 Price: 5,000mAh బ్యాటరీతో మార్కెట్లోకి Samsung Galaxy A15 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..
Samsung Galaxy A15 Price: అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను సాంసంగ్ కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy A15 Price: టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లో కూడా అనేక రకాల మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్స్ ను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం యువత ఎక్కువగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లోనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే దీనిని గుర్తించిన కొన్ని టెక్ కంపెనీలు అతి తక్కువ ధరలకే కస్టమర్స్ కి ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్నాయి. అయితే సాంసంగ్ కంపెనీ కూడా త్వరలోనే అతి తక్కువ ధరలు ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్ ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అతి త్వరలోనే సాంసంగ్ కంపెనీ మరో ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మొబైల్ ను కంపెనీ Galaxy A15 పేరుతో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే OLED ప్యానెల్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అనేక రకాల అధునాతన ఫీచర్, స్పెసిఫికేషన్స్ తో ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది.
Samsung Galaxy A15 ధర:
ఈ స్మార్ట్ ఫోన్ అనేక రకాలు కొత్త ఫీచర్స్ తో రాబోతోంది. అయితే సాధారణ బడ్జెట్లోనే కంపెనీ విడుదల చేయబోతున్నట్లు పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయితే ధర రూ. 22,000 ఉండవచ్చని సమాచారం. ఈ Samsung Galaxy A15 స్మార్ట్ ఫోన్ కంపెనీ రెండు వేరియంట్లలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి .
Also Read: Bhagavanth Kesari: కాజల్ కి ఆ పాత్ర వేస్ట్ అని ముందే చెప్పాను అంటున్న అనిల్ రావిపూడి
Samsung Galaxy A15 స్పెసిఫికేషన్‌ల వివరాల్లోకి వెళితే.. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. అతి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి ఫీచర్లను, ఇతర వివరాలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
లీకైన వివరాల్లోకి వెళితే..Samsung Galaxy A15 స్మార్ట్ ఫోన్ 5జీ వేరియంట్ తో పాటు 4జీ వేరియంట్ లో కూడా లభించబోతోంది. స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, U-ఆకారపు నాచ్‌తో మార్కెట్లోకి రాబోతోంది. ఇక బ్యాటరీ వివరాలకు వస్తే.. ఈ మొబైల్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Samsung Galaxy A15 మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.
Also Read: Bhagavanth Kesari: కాజల్ కి ఆ పాత్ర వేస్ట్ అని ముందే చెప్పాను అంటున్న అనిల్ రావిపూడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook