Samsung Galaxy F15: సాంసంగ్ నుంచి గుడ్‌న్యూస్..మిడిల్ రేంజ్ బడ్జెట్లో మార్కెట్‌లోకి Galaxy F15 మొబైల్!
Samsung Galaxy F15 5G Features - Specifications: సాంసంగ్ కంపెనీ త్వరలోనే మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అతి శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది.
Samsung Galaxy F15 5G Features - Specifications: సాంసంగ్ త్వరలోనే మార్కెట్‌లోకి మరో శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. అతి తక్కువ ధరలో శక్తివంతమైన ఫీచర్స్‌తో కంపెనీ మరో మొబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రముఖ టిప్ స్టర్స్ తెలుపుతున్నారు. సాంసంగ్ దీనిని F-సిరీస్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన SM-E156Bతో Geekbench 6 మోడల్ నంబర్ బెంచ్‌మార్క్ డేటాబేస్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ లాంచింగ్‌కి ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే లీక్ అయిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy F15 5G ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
లీక్ అయిన వివరాల ప్రకారం ఈ మొబైల్ అతి శక్తివంతమైన MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 4GB ర్యామ్ వేరియంట్‌తో రాబోతోంది. అలాగే 6000mAh బ్యాటరీ, Android 14 సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్ టాప్ OneUI స్కిన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ BIS సర్టిఫికేషన్‌ను సాధించింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
Samsung Galaxy F14 5G ఇతర ఫీచర్స్:
ఈ Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఈ మొబైల్ గరిష్టంగా 6GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఆక్టా-కోర్ Exynos 1330 ప్రాసెసర్‌పై రన్ అవుతుందని సమాచారం. ఇక ఈ మొబైల్ సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతుట్లు తెలుస్తోంది. అలాగే ఫ్రంట్ సెటప్‌లో భాగంగా ఈ మొబైల్ 13MP కెమెరాతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా అతి శక్తివంతమైన 6000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. దీనిని రోజంతా నాన్ స్టాప్ మొబైల్‌ని వినియోగించవచ్చు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter