Samsung Price Down: 6GB Ram, 50MP కెమేరా Samsung Galaxy M15పై భారీ డిస్కౌంట్
Samsung Galaxy M15 Price Down: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగిన కంపెనీ శాంసంగ్. అద్బుతమైన ఫీచర్లతతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటుంది. 50 మెగాపిక్సెల్ కెమేరాతో, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఆ వివరాలు మీ కోసం..
Samsung Galaxy M15 Price Down: శాంసంగ్ నుంచి ఇటీవల లాంచ్ అయిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M15 5G. అన్ని విధాలుగా ఈ ఫోన్ చాలా బెస్ట్‌గా నిలిచింది. అద్భుతమైన కెమేరా రిజల్యూషన్, అత్యధిక ర్యామ్ , హెవీ బ్యాటరీ బ్యాకప్ ఇలా అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ తక్కువ ధరకే లాంచ్ అయింది. ఇప్పుడీ ఫోన్‌ఫై మరింతగా అదనపు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఫోన్ ధర మరింత తగ్గింది.
లాంగ్ బ్యాటరీ, శక్తివంతమైన ఫీచర్లు, సూపర్ రిజల్యూషన్ కెమేరా కలిగి ఉండి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కావాలంటే Samsung Galaxy M15 5G బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ మార్కెట్‌లో 13,299 రూపాయలకే లాంచ్ అయింది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 4-6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో పాటు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఈ ఫోన్‌పై ఇప్పుడు మరింత డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఇప్పుడీ ఫోన్ కేవలం 12 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో పాటు పుల్ హెచ్‌డి రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 4 జీబీ, 6జీబీ ర్యామ్ ఉండటం వల్ల పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. స్టోరేజ్ 128 జీబీ ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉండి 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఇక కెమేరా కూడా అద్భుతంగా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరాతో పాటు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. మొత్తానికి ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ, స్టోన్ గ్రే రంగుల్లో లభిస్తోంది.
ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ 12,999 రూపాయలకు లిస్ట్ అయింది.హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 1000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ కూడా కలుపుకుంటే ఈ ఫోన్ మీకు 11,999 రూపాయలకే లభించనుంది. అదే 6 జీబీ ర్యామ్ కలిగిన ఫోన్ మాత్రం 14,799 వేలకు లాంచ్ అయింది.
Also read: Retirement Schemes: ఈ పధకాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తరువాత డబ్బుల కొరత ఉండదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook