Samsung Galaxy M34 5G: శాంసంగ్ గెలాక్సీ M34 5G వచ్చేసింది.. ఫన్ మోడ్‌లో ఫ్రంట్ కెమెరా, 16 రకాల ఎఫెక్ట్స్
Samsung Galaxy M34 5G: శాంసంగ్ గెలాక్సీ M సిరీస్‌లో కొత్తగా వచ్చి చేరిన శాంసంగ్ గెలాక్సీ M34 5G స్మార్ట్ ఫోన్ విక్రయాలు మొదలయ్యాయి. దీంతో గెలాక్సీ M34 5G ఫోన్ ఇక కస్టమర్స్ కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చేసింది.
Samsung Galaxy M34 5G: శాంసంగ్ గెలాక్సీ M సిరీస్‌లో కొత్తగా వచ్చి చేరిన శాంసంగ్ గెలాక్సీ M34 5G స్మార్ట్ ఫోన్ విక్రయాలు మొదలయ్యాయి. దీంతో గెలాక్సీ M34 5G ఫోన్ ఇక కస్టమర్స్ కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చేసింది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్‌లతో 6GB + 128GB వేరియంట్ ధర రూ. 16,999, అలాగే 8GB + 128GB వేరియంట్ ఫోన్ ధర రూ. 18,999 కే లభించనున్నట్టు శాంసంగ్ స్పష్టంచేసింది. మిడ్‌నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్‌ఫాల్ బ్లూ అనే మూడు కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ లభిస్తోంది.
నేటి నుంచే శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో శాంసంగ్ గెలాక్సీ M34 5G వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చేసింది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ గెలాక్సీ M34 5G ఫోన్ 5nm ఆధారిత ఎక్సీనోస్ 1280 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ M34 5G స్మార్ట్ ఫోన్‌లో హై రిజల్యూషన్, షేక్-ఫ్రీ ఫోటోస్, వీడియోస్ షూట్ చేయడానికి అనుగుణంగా 50MP నో షేక్ కెమెరా ఫీచర్ కూడా ఉంది. అంటే మూవింగ్‌లో ఉండగానే ఫోటోలు స్పష్టంగా తీసే అవకాశం ఈ ఫోన్ కల్పిస్తుందన్నమాట. అన్నట్టు ఇటీవల లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్లలో కొన్నింటిలో ఈ ఫీచర్ సాధారణం అవుతోంది. ఎందుకంటే 108MP, 200MP కెమెరాలు హై రిజల్యూషన్, హై క్వాలిటీ ఎప్పుడో కామన్ అయ్యాయి కనుక ఇక ఇప్పుడు షేక్ ఫ్రీ ఫోటోస్, వీడియోస్ ఫీచర్ యాడ్ చేసి కస్టమర్స్‌ని ఆకట్టుకునే పనిలో స్మార్ట్ ఫోన్ మేకర్స్ బిజీ అయ్యారు.
ఇది కూడా చదవండి : IT Refund Time, IT Returns Status: ఐటి రిఫండ్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది ?
ఇక రీల్స్, షాట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న నేటి జమానా అభిరుచికి అనుగుణంగా అందమైన సెల్ఫీల కోసం శాంసంగ్ గెలాక్సీ M34 స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 13MP హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. " ఇందులో ఫన్ మోడ్ కూడా ఉంటుందని.. అందులో భాగంగానే కస్టమర్స్ కెమెరాను కస్టమైజ్ చేసుకునేలా 16 రకాల ఇన్‌బిల్ట్ లెన్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి " అని శాంసంగ్ వెల్లడించింది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 6000mAh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే వినియోగాన్నిబట్టి రెండు రోజుల వరకు బ్యాటరీ ఇస్తుందని శాంసంగ్ కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి : Cheap And Best Sunroof Cars: తక్కువ ధరలో లభించే సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK