IT Refund Time, IT Returns Status: ఐటి రిఫండ్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది ?

IT Refund Time, IT Returns Status: ఐటి రిటర్న్స్... పన్ను చెల్లింపుదారుల్లో కూడా చాలామందికి ఇదొక అర్థం కాని వింత పదార్థంలా అనిపిస్తుంది. ఒకప్పటితో పోల్చుకుంటే, ఆన్‌లైన్ సేవల పరిధి పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెస్ ఎంతో సులువైపోయింది. అయినప్పటికీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ అంటే చాలామందికి చాలా రకాల సందేహాలు వెంటాడుతుంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2023, 08:44 AM IST
IT Refund Time, IT Returns Status: ఐటి రిఫండ్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది ?

IT Refund Time, IT Returns Status: ప్రభుత్వం విధించిన ఒక పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయడం అనేది తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పటితో పోల్చుకుంటే, ఆన్‌లైన్ సేవల పరిధి పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెస్ ఎంతో సులువైపోయింది. అయినప్పటికీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ అంటే చాలామందికి చాలా రకాల సందేహాలు వెంటాడుతుంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

ఆలస్య రుసుము లేకుండా 2022-23 ఆర్థిక సంవత్సరం (AY 2023-24) ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి ఈ నెల 31 వరకు తుది గడువు ఉంది. ఇప్పటికే ఈ నెలలో 15 రోజులు గడిచిపోగా.. తుది గడువుకు మరో 16 రోజులు మాత్రమే మిగిలి ఉంది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో టాక్స్ పేయర్స్ అందరూ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపులు, టాక్స్ రిఫండ్స్ కి సంబంధించిన లెక్కలు కూడా ముందే సిద్ధం చేసిపెట్టుకోవాలి. ఆదాయ పన్ను చట్టం, 1961 కింద పౌరులకు లభించే టాక్స్ ఎగ్జెంప్షన్స్, ఇతర డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత కలిగిన టాక్స్ పేయర్స్ కి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేసిన తర్వాత టాక్స్ డిడక్షన్ సోర్స్ లభిస్తుంది.

రీఫండ్‌ను క్లెయిమ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్

సంవత్సరం ఆదాయం రూ. 3 లక్షలు దాటిన వారు కొత్త పన్ను విధానంలో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని, అలాగే ఏదైనా రిఫండ్ రావాల్సి ఉంటే ఆ మొత్తాన్ని సూచిస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం... ఒకవేళ మీరు చెల్లించిన టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ ద్వారా చెల్లించిన పన్ను మొత్తం మీ మొత్తం పన్ను లయబిలిటీని మించినట్టయితే, మీరు టాక్స్ రీఫండ్‌కు అర్హులు అవుతారు.

ఆన్‌లైన్‌లో రీఫండ్ స్టేటస్ ఎలా ట్రాక్ చేయొచ్చు
మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తరువాత, మీరు ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ లోకి విజిట్ చేయడం ద్వారా మీ రీఫండ్ స్టేటస్ ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ చేయడానికి ఉపయోగించిన ఫోన్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయడంతో మీ రిఫండ్ స్టేటస్ ఏంటి అనేది ట్రాక్ చేయొచ్చు.

రిఫండ్ వేగంగా రావాలంటే..
"తాను ఫైల్ చేసిన ఐటి రిఫండ్‌కి ఎంత సమయం పడుతుంది ? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. అయితే, ఐటి రిఫండ్ కోసం ప్రత్యేకించి ఒక నిర్దిష్ట కాల పరిమితి అంటూ ఏమీ లేనప్పటికీ, సాధారణంగా రిఫండ్ కోసం ఫైల్ చేసిన తరువాత వారం రోజుల నుంచి ఆ తరువాతి 10 రోజులలోపు ఎప్పుడైనా ప్రాసెస్ అవుతుంది. మీరు ఫైల్ చేసే సమయం ( ఉదాహరణకు ఒకవేళ మీరు ఫైల్ చేసే తేదీ తుది గడువుకు దగ్గర్లో ఉంటే, అప్పుడు ఫైల్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కనుక మీ ఫైల్ ప్రాసెసింగ్ అవడంలో ఆలస్యం జరగొచ్చు), మీరు పొందుపర్చే డేటా ఖచ్చితత్వం మీద మీ రిఫండ్ వేగం ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి : Cheap And Best Sunroof Cars: తక్కువ ధరలో లభించే సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్లు

ఈసారి జూలై 31 గడువు సమీపిస్తోంది కనుక మీ రిఫండ్ ప్రాసెసింగ్ కోసం ఎంత సమయం పడుతుంది అనే అంచనా వేయడం కష్టమేనని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 9వ తేదీ నాటికే, ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం సుమారు 1.89 కోట్ల ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్ పూర్తి కాగా 1.74 కోట్ల కంటే ఎక్కువ రిటర్న్స్ వెరిఫై అయ్యాయి. మీ రీఫండ్‌ ప్రాసెస్‌లో జాప్యం లేకుండా ఉండాలి అంటే తుది గడువు వరకు వేచిచూడకుండా ఎంత త్వరగా ఐటి రిటర్న్స్ ఫైల్ చేస్తే అంత మేలు.

ఇది కూడా చదవండి : Honda Dio 125 Scooter: స్మార్ట్ ఫీచర్స్‌తో లాంచ్ అయిన హోండా డియో 125 స్కూటర్.. ధర కూడా చాలా తక్కువే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x