Get Samsung Galaxy S22 5G Just Rs 50499 in Amazon: సౌత్ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ 'శాంసంగ్'కి భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. శాంసంగ్ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ 'శాంసంగ్ గెలాక్సీ ఎస్22'. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఇంకా ఆసక్తి చూపుతున్నారు. కారణం ఇందులో ఇవ్వబడిన క్లాస్ ఫీచర్స్, గొప్ప డిజైన్. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ కూడా మార్కెట్లోకి వచ్చింది. దాంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ధర భారీగా తగ్గింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ కెమెరా ఇవ్వబడింది. అలాగే ఈ ఫోన్ డిస్‌ప్లే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చాలా సరసమైన ధరలో కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'అమెజాన్'లో గెలాక్సీ ఎస్22పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. గెలాక్సీ ఎస్22పై అందుబాటులో ఉన్న ఆఫర్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం. 


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 91,999. అయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్‌లు రూ. 50499కి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అమెజాన్‌లో 45 శాతం భారీ తగ్గింపు ఇవ్వబడుతుంది. అంటే మీరు ఏకంగా రూ. 41,500 వేల తగ్గింపును శాంసంగ్ గెలాక్సీ ఎస్22పై పొందొచ్చు. ఈ భారీ తగ్గింపు తర్వాత వినియోగదారులు ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను రూ. 50499కి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. గొప్ప ఫీచర్లు మరియు గొప్ప డిజైన్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇంత భారీ తగ్గింపు ఇవ్వబడుతోందని బహుశా చాలా మంది కస్టమర్‌లకు తెలియకపోవచ్చు. తెలిసిన వారు కొనేందుకు ఎగబడుతున్నారు. 


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్‌లో 8 GB RAM మరియు 128 GB స్టోరేజ్ అందించబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేతో వస్తుంది. ఇది డైనమిక్ AMOLED డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లేతో వినియోగదారులు ఈ శ్రేణిలోని ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో అందించబడని మంచి అనుభవాన్ని పొందుతారు. మీరు కూడా ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. వెంటనే అమెజాన్‌ను సంప్రదించండి. 


Also Read: Cheteshwar Pujara Vice Captain: టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఛతేశ్వర్‌ పుజారా!  


Also Read: RR vs RCB: 59 పరుగులకే రాజస్థాన్‌ ఆలౌట్.. 112 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.