Samsung Galaxy S22 Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఎస్22పై భారీ డిస్కౌంట్.. కొనడానికి ఎగబడుతున్న జనాలు! 22 వేలు సేఫ్
Samsung Galaxy S22 Sale Price, Purchage Samsung Galaxy S22 5G smartphone just Rs 50999 in Flipkart. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఏకంగా 22 వేలు ఆదా చేసుకోవచ్చు.
Purchage Samsung Galaxy S22 5G smartphone just Rs 50999 in Flipkart: సౌత్ కొరియన్ మొబైల్ దిగ్గజం 'శాంసంగ్'కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు నూతన మోడల్స్ తీసుకొస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అందుకే ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా శాంసంగ్ కంపెనీవే ఉన్నాయి. అయితే గతేడాది రిలీజ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్22 (Samsung Galaxy S22)పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఏకంగా 22 వేలు (Samsung Galaxy S22 Sale Price) ఆదా చేసుకోవచ్చు.
Samsung Galaxy S22 Flipkart Offers:
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియెంట్ అసలు ధర రూ. 72,999. ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ధర రూ. 50,999లుగా ఉంది. అంటే మీరు 22 వేలు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి భారత్‌లో మరె ఫ్లాగ్‌షిప్ ఫోన్ దాదాపు రూ. 51,000కు అందుబాటులో లేదు. శాంసంగ్ గెలాక్సీ S22 మోడల్ పాత 5G స్మార్ట్‌ఫోన్. అయినా అద్భుతమైన కెమెరా సెటప్ కలిగి ఉంది. సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునే వారికీ ఈ గెలాక్సీ S22 5G ఫోన్ చాలా బాగుంటుంది.
Samsung Galaxy S22 Features:
శాంసంగ్ గెలాక్సీ ఎస్22లో సాఫ్ట్‌వేర్ సపోర్టు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేద. ఎందుకంటే శాంసంగ్ దీర్ఘకాలిక సపోర్టు అందిస్తుంది. ఈ 5G ఫోన్ నాలుగు ఏళ్ల పాటు మెయిన్ (Android OS) అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14, Android 15, Android 16 OS అప్‌డేట్‌లకు సపోర్టు ఇస్తుంది. ఇక S23తో పోలిస్తే.. ఈ ఫోన్‌లో అతిపెద్ద వ్యత్యాసం చిప్‌సెట్ మరియు బ్యాటరీ. స్టీరియో స్పీకర్లు, IP68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 6.1-అంగుళాల AMOLED డిస్‌ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరాలు వంటి మిగిలిన ఫీచర్లు రెండింటిలో ఒకే విధంగా ఉంటాయి.
Samsung Galaxy S22 Battery:
కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ని కోరుకునే వ్యక్తులుశాంసంగ్ గెలాక్సీ S22ని ఉపయోగించడాన్ని ఇష్టపడతారు. అయితే కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. ఇందులో చిన్న బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. అంటే ఫోన్ రోజంతా పనిచేయదు. కనీసం రెండు సార్లు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కాలింగ్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగిస్తే బ్యాటరీ త్వరగా అయిపోదు. కాస్త బడ్జెట్ ఎక్కువగా ఉంటే S22+ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దీని ధర రూ. 62,850. భారతదేశంలో రూ. 84,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.