COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy Tab S6 Lite Price Down: ప్రస్తుతం చాలా మంది ల్యాప్‌ట్యాప్‌లకు బదులుగా ఎక్కువగా ట్యాబ్స్‌ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాస్‌లో భాగంగా వీటి వినియోగం పెరగడంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. దీంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ప్రత్యేకమై ఫీచర్స్‌తో కొత్త కొత్త మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇటీవలే సాంసంగ్ నుంచి మార్కెట్‌లోకి విడుదలైన ట్యాబ్‌కు మంచి ప్రజాదరణ లభించింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి చౌకగా రావడం వల్ల చాలా మంది దీనిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. అయితే సాంసంగ్‌ సంబంధించిన ఏ ట్యాబ్‌ డెడ్‌ చీప్‌ ధరలో లభిస్తుందో.. దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 
సాంసంగ్‌ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన Samsung Galaxy Tab S6 Lite 26.31 cm స్మార్ట్‌ ట్యాబ్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం 4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ట్యాబ్ ధర విషయానికొస్తే మార్కెట్‌లో MRP ధర రూ.30,999తో లభిస్తోంది. దీంతో పాటు అమెజాన్‌లో ఈ ట్యాబ్‌ను గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 32 శాతం తగ్గింపుతో కేవలం రూ.20,999కే లభిస్తోంది. దీంతో పాటు అదనం దీనిపై బ్యాక్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.


ఇక ఈ ట్యాబ్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ ట్యాబ్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ.2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్‌ పే ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి కూడా  ఈ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ ట్యాబ్‌ను BOBCARD, OneCard క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి కూడా రూ.1,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో అన్ని బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కొత్త Samsung Galaxy Tab S6 Lite 26.31 cm స్మార్ట్‌ ట్యాబ్ రూ.18 వేల లోపే పొందవచ్చు. అన్ని ఆఫర్స్‌ పోను ఈ ట్యాబ్‌ను రూ.1,199కే పొందవచ్చు. 


డిస్‌ప్లే:
10.4-అంగుళాల (26.31 సెం.మీ) TFT LCD డిస్‌ప్లే
2000 x 1200 పిక్సెల్‌ల రిజల్యూషన్
16M రంగుల మద్దతు


ప్రాసెసర్ & మెమరీ:
Qualcomm ప్రాసెసర్, Octa Core, 2.3 GHz
4GB RAM
64GB లేదా 128GB అంతర్గత నిల్వ

ఆపరేటింగ్ సిస్టమ్:


Android 10
One UI 5
కెమెరాలు:
8MP ప్రాధమిక కెమెరా
5MP ముందు కెమెరా


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌:
S పెన్ స్టైలస్
Dolby Atmos తో డ్యూయల్ స్పీకర్లు
Wi-Fi 802.11 a/b/g/n/ac
బ్లూటూత్ 5.0
USB Type-C పోర్ట్
7,040mAh బ్యాటరీ (13 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయం వరకు)


బరువు:
467 గ్రాములు


రంగులు:
ఆక్స్‌ఫర్డ్ గ్రే
ఆంథ్రాసైట్ బ్లాక్   


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి