COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy Z Flip5 Maison Margiela Edition: సాంసంగ్‌ నుంచి ఎట్టకేలకు Samsung Galaxy Z Flip5 Maison Margiela ఎడిషన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ గత నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల విడుదల తేదిల్లో మార్పులు చేసింది. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ మాసన్ మార్గీలా సహకారంతో సాంసంగ్‌ ఈ  స్మార్ట్ ఫోన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. అయితే ఈ కొత్త ఎడిషన్‌లో చాలా రకాల కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ కొత్త ఎడిషన్‌ ప్రత్యేకత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ కొత్త ఎడిషన్ ధర:
సాంసంగ్‌ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన Galaxy Z Flip5 Mason Margiela ఎడిషన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే అతి త్వరలోనే ఈ మొబైల్‌ ధరను విడుదల చేయబోతున్నట్లు అధికారిక సమాచారం. ఈ Mason Margiela ఎడిషన్‌ను కంపెనీ నవంబర్‌ 30వ తేదిన మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. 


Galaxy Z Flip5 Maison Margiela ఎడిషన్ ఫీచర్లు:
మార్గీలా సహకారంతో రూపొందించిన Galaxy Z Flip5 Mason Margiela ఎడిషన్‌లో కొన్ని కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొత్త ఎడిషన్‌ వెనక గాజు ఫ్రెమ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు మైసన్ మార్గీలా ఈ మొబైల్‌ బాడీని వెండి ఇతర లోహాలతో తయారు చేసిందని పేర్కొంది. అంతుకాకుండా ఈ Galaxy Z Flip5 Maison Margiela స్మార్ట్ ఫోన్‌ ఎడిషన్ ప్రత్యేక ఇన్-బాక్స్ కంటెంట్‌తో రిటైల్ బాక్స్‌తో రాబోతున్నట్లు సమాచారం..ఈ మొబైల్‌ వెనుక భాగంలో ఫాబ్రిక్ లోగో లేబుల్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం లుకింగ్‌ కోసం లెదర్ కేస్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఈ ఎడిషన్‌ ఫ్లిప్‌సూట్ కార్డ్‌లు పెయింట్ స్ప్లాటర్ డిజైన్, సిల్వర్ ప్లేట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. మైసన్ మార్గీలా ఈ స్మార్ట్‌ ఫోన్‌కి ప్రత్యేక డిజైన్‌ను అందించింది. 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


సాంసంగ్‌ Galaxy Z Flip5 Maison Margiela ఎడిషన్ ఫీచర్స్‌:
ఈ సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌  6.7 అంగుళాల పూర్తి-HD ప్లస్ డైనమిక్ AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది. ఈ డిస్ప్లే  120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2640x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌ వెనక, ముందు భాగం ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రోటక్షన్‌తో రాబోతోంది. ఈ ఎడిషన్‌ మొబైల్‌ ఫోన్‌ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ 8GB RAMతో 256GB/512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో రాబోతోంది. దీంతో పాటు ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే OneUI 5.1.1పై రన్ అవుతుంది. 


ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
3700mAh బ్యాటరీ
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ 
15W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ 
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
12-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా
10 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
e-SIM సపోర్ట్


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook