Samsung Galaxy Z Fold 5 And Flip 5 launch Date: ప్రముఖ దక్షిణ కొరియా కంపెనీ సాంసంగ్‌కు మార్కెట్‌లో మంచి పేరు ఉంది. ప్రతి నెలలో ఈ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ ఫోన్లు విడదలవుతాయి. ఇటీవల విడుదలైన సాంసంగ్‌ ఎస్‌ 23కి మంచి గుర్తింపు లభించింది. అయితే సాంసంగ్‌ త్వరలోనే మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సాంసంగ్‌ Z Fold 5, Galaxy Z Flip 5ను మార్కెట్‌లోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.  గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేయబోతున్నారని వార్తాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తాల్లో ఎంత వరకు నిజముందో, ఈ స్మార్ట్‌ ఫోన్‌ విడుదలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  


Samsung Galaxy Z ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 లాంచింగ్‌ తేది అప్పుడే:
జూలై 26 Samsung Galaxy Z ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ భావిస్తోంది. ఆగస్టు 4న ఈ స్మార్ట్‌ ఫోన్లు ఈ కామర్స్‌ కంపెనీలతో పాటు సాంసంగ్‌ షో రూం లోకి అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని పైన పేర్కొన్న తేదిల కంటే ముందే విడుదల చేసే అవకాశాలున్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌లకు సంబంధించిన సమాచారం ఇప్పటికీ కంపెనీ అధికారి వెబ్‌ పోర్టల్‌ పేర్కొనలేదు. 


Samsung Galaxy Z ఫోల్డబుల్ ఆగస్టు నెలలో లాంచ్ కాబోతోంది. అయితే ఇదే క్రమంలో యాపిల్‌ కూడా మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేస్తోంది. కాబట్టి రెండు కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు ఒకే సారి విడుదల కాబోతున్నాయి. దీంతో సాంసంగ్‌ యాపిల్‌ లాంచిగ్‌ దృష్టిలో పెట్టుకుని అనుకున్న దాని కంటే తొందరలోనే ఫోల్డ్ 5, ఫ్లిప్ 5  మార్కెట్‌లోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఇక రేట్ల విషయానికొస్తే వినియోగదారులకు అనుగుణంగానే ఉండే అవకాశాలున్నాయి. 


Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి