Samsung Galaxy F15 5G: రూ.15 వేలలోపు మంచి 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే బెస్ట్ ఆప్షన్..
Samsung Galaxy F15 5G: ఇటీవల సామ్‌సంగ్ నుంచి మార్కెట్లోకి ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వచ్చింది. ఈ మెుబైల్ ఫోన్ యెుక్క ఫీచర్స్, ధర తదితర వివరాలు గురించి తెలుసుకుందాం.
Samsung Galaxy F15 5G Price and Features: దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్స్ వాడేవారికి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రముఖ కంపెన్నీలన్నీ తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొస్తున్నాయి. రీసెంట్ గా సామ్‌సంగ్ కూడా దేశీయ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్ ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్15 5జీ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. పైగా ధర కూడా తక్కువ. ఈ మెుబైల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్15 స్మార్ట్ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్, 6.5 అంగుళాల అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 14నపై రన్ అవుతోంది. 6000mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌కు 5 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్‌ను ఇస్తున్నారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో రాబోతుంది. ఇందులో మెమెురీ కార్డును 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో రాబోతుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్ తో రానుంది. దీంతోపాటు 5 ఎంపీ, 2ఎంపీ కెమెరాను కూడా అందించారు. ఫ్రంట్ కెమెరా 13మెగా ఫిక్సల్ తో రాబోతుంది. బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్‌నూ కూడా అందించారు. ఇందులో ప్రత్యేకంగా వాయిస్ ఫోకస్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక 4జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,000కాగా.. 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,000గా నిర్ణయించారు. దీనిని మూడు కలర్స్ లో తీసుకురానున్నారు. వచ్చే ఏడాది కాలంలో 20 లక్షల గెలాక్సీ ఎఫ్ 15 స్మార్ట్‌ఫోన్లను విక్రయించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
Also Read: Auto News: మన దేశంలోని దొంగలకు ఈ కంపెనీ కార్లంటే చాలా ఇష్టమట...చూడగానే చోరీ చేసేస్తారట..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి