7th Pay Commission: ఎన్నికల ముందే మోడీ సర్కార్ హోలీ కానుక.. మరోసారి ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలపెంపు..

7th Pay Commission: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ నేడు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు కానుకను ఇచ్చింది. భారీ మొత్తంలో వారికి జీతాలు పెంచింది. దీంతో లక్షలాది మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు హోలీకి ముందే గిఫ్ట్‌ ఇచ్చేసింది కేంద్రం. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 16, 2024, 11:27 AM IST
7th Pay Commission: ఎన్నికల ముందే మోడీ సర్కార్ హోలీ కానుక.. మరోసారి ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలపెంపు..

7th Pay Commission: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ నేడు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు కానుకను ఇచ్చింది. మోడీ సర్కార్ హోలీ కానుకగా భారీ మొత్తంలో వారికి జీతాలు పెంచింది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు 17 శాతం బేసిక్ పే పెంచేసింది. దీంతో ఎల్‌ఐసీ ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు పెరగనున్నాయి. కేంద్ర నిర్ణయంతో దాదాపు లక్షాపదివేల మందికి పైగా ఎల్‌ఐసీ ఉద్యోగులు లబ్దిపొందనున్నారు. అంతేకాదు దాదాపు 30 వేల మంది పింఛనుదారులు కూడా ప్రయోజనం పొందనున్నారు. ఇది 2022 ఆగస్టు 1 నుంచి అమలు కానుంది. 

ఇదీ చదవండి: మన దేశంలోని దొంగలకు ఈ కంపెనీ కార్లంటే చాలా ఇష్టమట...చూడగానే చోరీ చేసేస్తారట..!

ఇటీవలె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 50 శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు 46 శాతం ఉండగా 4 శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో రెండుసార్లు డీఏ పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఈ జీతం పెంపు ఉంటుంది. 2016 డియర్‌నెస్ అలవెన్స్ నిబంధనల ప్రకారం 7వ వేతన సంఘం అమలు ప్రారంభమైనప్పుడు డీఏను జీరో చేశారు. ఎందుకంటే డీఏ 50 శాతానికి చేరుకోగానే అప్పటి వరకూ ఉన్న డీఏ మొత్తాన్ని ఉద్యోగి కనీస వేతనంలో చేర్చుతుంటారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఈ జీతాలు పెరగనున్నాయి.

ఇదీ చదవండి:  మొట్టమొదటి సారిగా రోడ్డుపై దర్శనమిచ్చిన కొత్త Tata Punch SUV..పూర్తి వివరాలు ఇవే!

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులకు కూడా ఈ పెంపు అమోదించిన కొద్దిరోజులకే ఎల్‌ఐసీ ఎంప్లాయీస్ కు కూడా జీతాలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ తీపి కబురు కోసం ఎల్‌ఐసీ ఉద్యోగులు చాలారోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హోలీకి ముందే ప్రభుత్వం ఈ భారీ కానుకను వారికి గిఫ్ట్‌ గా ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రతి యేటా రెండు సార్లు పెరుగుతుంటుంది. ప్రతి నెలా విడుదలయ్యే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఆరునెలలకోసారి డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీని ప్రకారం జనవరి 2024 నుంచి డీఏ పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46 శాతం ఉన్న డీఏ మరో 4 శాతం పెరిగి 50 శాతానికి చేరుకోనుంది. డీఏ 50 శాతానికి చేరుకోగానే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి.  (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News