Auto News: మన దేశంలోని దొంగలకు ఈ కంపెనీ కార్లంటే చాలా ఇష్టమట...చూడగానే చోరీ చేసేస్తారట..!

viral news: ఈ మధ్య కాలంలో దేశంలో కార్ల దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. దొంగలు ఎక్కువగా ఈ మోడల్ కార్లను చోరీ చేస్తున్నారో తెలుసా? ఇంతకీ ఏ నగరంలో కార్ల దొంగతనాలు ఎక్కువగా జరుగున్నాయో తెలుసా?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2024, 08:43 PM IST
Auto News: మన దేశంలోని దొంగలకు ఈ కంపెనీ కార్లంటే చాలా ఇష్టమట...చూడగానే చోరీ చేసేస్తారట..!

Most Frequently Stolen Cars in India: ఇటీవల కాలంలో మనదేశంలో కార్ల దొంగతనాలు పెరిగిపోయాయి. ప్రముఖ బీమా కంపెనీ ఎకో ఈ కార్ల చోరీకి సంబంధించి 'థెఫ్ట్ అండ్ ది సిటీ' పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ఆరు పెద్ద నగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై మరియు కోల్‌కతాల్లో ఎక్కువ కార్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇందులో రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో ఉంది.  ఆ తర్వాత చెన్నై రెండో స్థానంలో, బెంగళూరు మూడో స్థానంలో, హైదరాబాద్ నాలుగో స్థానంలో, ముంబై ఐదో స్థానంలో, కోల్‌కతా ఆరో స్థానంలో నిలిచాయి. 

ఈ రిపోర్టు ప్రకారం, గతేడాది దేశవ్యాప్తంగా దొంగిలించబడిన అన్ని వాహనాలలో 37% ఢిల్లీలోనే జరిగాయి. రాజధానిలోని భజన్‌పురా, ఉత్తమ్‌నగర్‌లలో కార్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా షహదారా, పట్పర్‌గంజ్ మరియు బదర్‌పూర్‌లలో కూడా చాలా కార్లు దొంగిలించబడుతున్నాయి. 

దొంగలకు ఈ రెండు మోడల్స్ చాలా ఇష్టమట..
దొంగలు ఎత్తుకెళ్తున్న మెుత్తం కార్లలో కార్లలో 47% మారుతి సుజుకి మోడల్సే. మరి ముఖ్యంగా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న కార్లను చోరీ చేస్తున్నారని ఈ నిపేదిక పేర్కొంది. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే మారుతీ వ్యాగన్ఆర్, మారుతీ స్విఫ్ట్‌ కార్లను టార్గెట్ చేస్తూ వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ మారుతీ మోడల్స్ తర్వాత ఎక్కువగా హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10లను ఎత్తుకెళ్తున్నారు. 

ఢిల్లీలో కార్ల దొంగతనాలు ఎందుకు ఎక్కువ?
సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపైనే కార్లను వదిలేస్తారు. దీనిని ఆసరాగా చేసుకున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో వాహనాల విడిభాగాల కోసం సెకండ్ హ్యాండ్ మార్కెట్లు ఉన్నాయి. ఇది కూడా కార్ల దొంగతనాలకు మరోక కారణం. 

Also Read: Top 5 Mileage Bikes: 150 సిసీలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే

Also Read: New Tata Punch Facelift: మొట్టమొదటి సారిగా రోడ్డుపై దర్శనమిచ్చిన కొత్త Tata Punch SUV..పూర్తి వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News