Samsung Galaxy M04: శాంసంగ్ ఎం సిరీస్‌లో మరో అద్భుత ఫోన్ లాంచ్, ధర ఎంతంటే
Samsung Galaxy M04: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎం సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్ లాంచ్ చేసింది. కళ్లు చెదిరే డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లో ఉన్న ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం..
శాంసంగ్ తాజాగా ఎం సిరీస్‌లో సూపర్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M04 ఇవాళ మార్కెట్‌లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా..ధర చాలా తక్కువ. ఆ వివరాలు మీ కోసం..
Samsung Galaxy M04 ఇవాళ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ డిజైన్ యూనిక్‌గా, ఫీచర్లు స్టైలిష్‌గా ఉన్నాయి. అత్యంత తక్కువ ధరకే లాంచ్ కావడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంట్రీ లెవెల్ ఫోన్స్‌లో బెస్ట్ ఫోన్‌గా చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతల గురించి మాట్లాడితే..గెలాక్సీ ఎం 04 మీడియాటెక్ హెలియో పీ35 ప్రోసెసర్‌తో నడుస్తుంది. 2.3 గిగాహెర్ట్జ్ వరకూ నడుస్తుంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. 8 జీబీ ర్యామ్ వరకూ పెంచుకోవచ్చు. అద్భుతమైన పనితీరు, మృదువైన మల్టీ టాస్కింగ్, సీమ్‌లెస్ యాప్ వేవిగేషన్, ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అనుభూతిని ఇస్తుంది. గెలాక్సీ ఎం 04 1 టీబీ వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు.
యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ ఎం 04 లో ఫేస్ అన్‌లాక్ సౌకర్యం ఉంది. గెలాక్సీ ఎం 04 స్మార్ట్‌ఫోన్ నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ ఇస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యముంది.
గెలాక్సీ ఎం 04లో 6.5 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. అద్ఫుతమైన ఫోటో క్యాప్చర్ కోసం 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమేరా ఉంది. ఇందులో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ప్రత్యేకత.
గెలాక్సీ ఎం 04 లో 4 జీబీ ర్యామ్, 6 4 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తోంది. ఈ మోడల్ ధర 9,499 రూపాయలుగా ఉంది. ఇక 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 10, 499 రూపాయలుగా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 1000 రూపాయలు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు ట్రెండీ రంగులైన లైట్ గ్రీన్, డార్క్ బ్లూలో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Samsung.com, Amazon.inలో, రిటైల్ అవుట్ లెట్స్‌లో అందుబాటులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook