Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దాదాపుగా అన్ని మోడల్ ఫోన్లు హిట్ అయ్య్యాయి. ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ Samsung Galaxy F54 5G లాంచ్ చేసింది. అటు కెమేరా, ఇటు ఫీచర్లు రెండూ అద్భుతంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో ఎక్సినోస్ 1380 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది. దీంతో పాటు ఆడియో జాక్, బ్లూటూత్, వైపై వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ర్యామ్ అయితే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉండటం వల్ల అపరిమితమైన డేటా భద్రం చేసుకోవచ్చు. ఫోన్ పనితీరు కూడా వేగవంతంగా ఉంటుంది. ఇందులో బ్యాటరీ కూడా అత్యధిక సామర్ధ్యంలో వస్తోంది. ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 


Samsung Galaxy F54 5G కెమేరా అయితే చాలా వపర్‌ఫుల్‌గా ఉంటుంది. ట్రిపుల్ కెమేరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా సెన్సార్, 2 మెగ్పిక్సెల్ మ్యాక్రో కెమేరా సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 5జి ధర ఇండియన్ మార్కెట్‌లో దాదాపుగా 2499 రూపాయలుంది. ఇది 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర. ప్రస్తుతానికి ఒకటే వేరియంట్ అందుబాటులో ఉంది. 


Also read: IT Returns Revise: ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేయాలో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook