COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Mobile Loot Offer: ప్రస్తుతం మార్కెట్‌లో సాంసంగ్‌ బ్రాండ్‌కి సంబంధించిన F, M సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ మొబైల్‌ ఫోన్స్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. అయితే మీరు కూడా F, M సిరీస్‌లకు సంబంధించి సాంసంగ్‌ Galaxy F54 5G, Galaxy M34 5G స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు సాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే MRP కంటే చాలా తక్కువ ధరల్లో లభిస్తాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Galaxy F54 5G:
ప్రస్తుతం సాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ Galaxy F54 5G స్మార్ట్‌ ఫోన్‌ 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ధర MRP రూ. 35,999లు కాగా సాంసంగ్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ.11,000 తగ్గింపుతో కేవలం రూ.24,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు కూడా లభిస్తుంది. అయితే మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 2,000 తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా భారీ బోనస్‌ పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది.


ఇక Galaxy F54 5G స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్‌  6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఇక సెల్ఫీ కోసం..32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


Galaxy M34 5G:
ప్రస్తుతం ఈ Galaxy M34 5G స్మార్ట్‌ ఫోన్‌ 8 GB ర్యామ్‌ వేరియంట్‌ లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర MRP రూ.  25,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ.4,000 తగ్గింపుతో కేవలం రూ.21,999కే పొందండి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా రూ.2,000 వరకు ఫ్లాట్‌ తగ్గింపు కూడా పొందవచ్చు. ఇక ఈ మొబైల్‌ను మీరు బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌తో కూడా కొనుగోలు చేయోచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై మరిం తగ్గింపు పొందడానికి SBI క్రెడిట్ కార్డ్,  Samsung Axis బ్యాంక్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. 


ఈ Galaxy M34 5G మొబైల్‌పై Paytm ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. పేటీఎమ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ మొబైల్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ  డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది. ఈ Galaxy M34 5G స్మార్ట్‌ ఫోన్‌ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook