Samsung: శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, 440 మెగాపిక్సెల్ కెమేరా
Samsung: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మేజర్ వాటా శాంసంగ్‌దే. అద్భుతమైన ఫీచర్లు, క్వాలిటీ రెండూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ బ్రాండ్ నిలబెడుతున్నాయి. ఎన్ని రకాల ఫోన్లు అందుబాటులో వచ్చినా ఇప్పటికీ శాంసంగ్ అంటే ఒక నమ్మకం. క్రేజ్.
Samsung: ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది శాంసంగ్. ఇప్పుడు త్వరలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కెమేరా గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఐఫోన్ కూడా వెనుకంజ వేయాల్సిందే.
శాంసంగ్ నుంచి త్వరలో ఏకంగా 440 మెగాపిక్సెల్ కెమేరా కలిగిన స్మార్ట్‌ఫోన్ రానుంది. నమ్మలేకపోతున్నారా..కానీ నిజం ఇది. ఇప్పటి వరకూ మార్కెట్‌లో 200 మెగాపిక్సెల్ కెమేరానే అత్యధికం. ఇప్పుడు ఏకంగా 440 మెగాపిక్సెల్ కెమేరాతో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది శాంసంగ్. ఇది కాకుండా 320 మెగాపిక్సెల్ సెన్సార్ కెమేరా ఉంటుంది. శాంసంగ్ ఎస్ సిరీస్‌లో ఇది లాంచ్ కానుంది.
వాస్తవానికి శాంసంగ్ ఈ ఏడాదే Galaxy S 23 Ultra 200 మెగాపిక్సెల్ కెమేరాతో లాంచ్ చేసింది. ఇప్పటి వరకూ మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో 200 మెగాపిక్సెల్ అత్యధికం. కానీ ఈసారి శాంసంగ్ 2024లో మూడు కొత్త సెన్సార్‌లు ప్లాన్ చేస్తోంది. ఇందులో సరికొత్తగా 440 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కానుంది.
Samsung 440MP camera sensor
శాంసంగ్ కొత్తగా 50 మెగాపిక్సెల్ జీఎన్6 సెన్సార్, 200 మెగాపిక్సెల్ హెచ్‌పి 7 సెన్సార్ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో మొదటి సెన్సార్ పిక్సెల్ సైజ్ 1.6μm కాగా రెండవ సెన్సార్ పిక్సెల్ సైజ్ 0.6μmగా ఉంది. ఇందులో శక్తివంతమైన 440 మెగాపిక్సెల్ HU1సెన్సార్ కూడా ఉంది. అయితే దీనిపై కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. 2024 రెండవ అర్ధభాగంలో లాంచ్ చేయవచ్చని సమాచారం.
50MP ISOCELL GN6లో 1.6μm పిక్సెల్ ఉంటుంది. ఇది ఐసోసెల్ జీఎన్1, ఐసోసెల్ జీఎన్ 2 కెమేరా సెన్సార్‌కు కొనసాగింపు కావచ్చు. ఐసోసెల్ జీఎన్ 6 శాంసంగ్ కంపెనీకు చెందిన అత్యంత శక్తివంతమైన సోనీకు పోటీ ఇచ్చే సామర్ధ్య కలిగింది. ఇది కాకుండా 320 మెగాపిక్సెల్ కెమేరా సెన్సార్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ చిప్ కూడా 320 మెగాపిక్సెల్ కెమేరాను సపోర్ట్ చేస్తుంది.
Also read: Realme 11X 5G Launch: సూపర్ కెమేరా, బ్యాటరీతో రియల్ మి 11X 5G రేపే లాంచ్, ఇయర్ బడ్స్ ఉచితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook