Realme 11X 5G Launch: సూపర్ కెమేరా, బ్యాటరీతో రియల్ మి 11X 5G రేపే లాంచ్, ఇయర్ బడ్స్ ఉచితం

Realme 11X 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రియల్ మి వరుస సంచలనాలు రేపుతోంది. ఏడాదికి కచ్చితంగా రెండు మోడల్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా రేపు మరో కొత్త మోడల్ లాంచ్ చేయనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 22, 2023, 11:22 AM IST
Realme 11X 5G Launch: సూపర్ కెమేరా, బ్యాటరీతో రియల్ మి 11X 5G రేపే లాంచ్, ఇయర్ బడ్స్ ఉచితం

Realme 11X 5G Launch: రియల్ మి కంపెనీ లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్ Realme 11X 5G ఇండియాలో లాంచ్ తేదీని ఇప్పటికే ప్రకటించింది. రేపు అంటే ఆగస్టు 23వతేదీన భారతీయ మార్కెట్‌లో లాంచ్ సందర్భంగా ఎర్లీ బర్డ్ సేల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి. అంటే ఈ ఫోన్ లాంచ్ అవడమే ఆఫర్‌తో రానుంది.

Realme 11X 5G లాంచింగ్ ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6-8 గంటల మధ్య ఉంటుందని రియల్ మి స్పష్టం చేసింది.  ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు Realme.com, Flipkartలో అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 20 వేల కంటే తక్కువే ఉండవచ్చని అంచనా. Realme 11X 5G స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై 1000 రూపాయల వరకూ డిస్కౌంట్ ఉంటుందని రియల్ మి కంపెనీ తెలిపింది. దాంతోపాటు కస్టమర్లకు 3 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ లభిస్తుంది. మరోవైపు Realme 11X 5Gలో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కొనుగోలుపై 6 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ వర్తిస్తుంది. 

Realme 11X 5G ఫీచర్లు

Realme 11X 5Gలో 2x  ఇన్ సెన్సార్ జూమ్‌తో పాటు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉంటుంది. 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ మరో ప్రత్యేకత. కేవలం 29 నిమిషాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ 0 నుంచి 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్షన్ 6100+ 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 16జీబీ వరకూ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. Realme 11X 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఒకటి 6జీబీ ర్యామ్ కాగా రెండవది 8జీబీ ర్యామ్. రెండింటి స్టోరేజ్ 128జీబీనే.

Realme 11X 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కంపెనీ ఇచ్చే 1000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు ఇయర్ బడ్స్ ఉచితంగా అందుతాయి. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్లు ఉండనే ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ ఎలాగూ ఉంటుంది. 

Also read:  EPF Interest Credited or Not: పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది ? ఖాతాల్లో ఉన్న మొత్తంపై వడ్డీ ఎందుకు రాదు ?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News