Panasonic Z95A, Z93A OLED TVs: ప్రముఖ టెక్‌ కంపెనీ పానాసోనిక్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేయబోతోంది. ఈ లాంచింగ్‌ స్మార్ట్ టీవీని కంపెనీ కొత్త OLED డిస్ల్పేతో కస్టమర్స్‌కి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పానాసోనిక్ స్మార్ట్‌ టీవీ ఇంటిగ్రేటెడ్ స్ట్రీమింగ్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఈ టీవీ అన్ని స్మార్ట్‌ టీవీల్లా కాకుండా  Amazon Fire TV ఇంటర్‌ఫేస్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ టీవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పానాసోనిక్ OLED TV ఫీచర్లు:
ఈ స్మార్ట్‌ టీవీ పానాసోనిక్, అమెజాన్ భాగస్వామ్యంతో పానాసోనిక్ Z95A, Z93A అనే ​​రెండు మోడల్స్‌లో OLED TVలను మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. వీటిని ముందుగా కంపెనీ 55 అంగుళాల, 77 అంగుళాల వేరియంట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ OLED ఇంటిగ్రేటెడ్ టీవీలు స్ట్రీమింగ్‌, ఆడియో పరంగా ఏ మాత్రం వెనకాడకుండా నూతన సాంకేతిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ భావిస్తోంది. ఈ టీవీ లుక్‌ పరంగా చూస్తే..ఇంతక ముందు మార్కెట్‌లో ఉన్న డిజైన్స్‌ కంటే కొత్తగా కనిపిస్తుందని సమాచారం.


ఈ రెండు స్మార్ట్ టీవీ మోడల్స్‌ డాల్బీ విజన్ IQ ప్రెసిషన్, HCX ప్రో AI ప్రాసెసర్ MK IIతో అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ టీవీలు ఎంతో నాణ్యమైన పిక్చర్‌ క్వాలిటీతో అవుట్‌పుట్‌ను అందిస్తాయి. దీంతో పాటు స్క్రీన్ లైటింగ్‌ ఫీచర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు టీవీలు గేమింగ్ ప్రియులకు ఎంతో మంచి పిక్చర్‌ అనుభూతినిస్తాయి.


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..


పానాసోనిక్ టీవీల్లో సౌండ్ క్వాలిటీ మరో కీలక ఫీచర్.. ఈ స్మార్ట్‌ టీవీల్లో కంపెనీ బ్రాండ్ 360 సౌండ్‌స్కేప్ ప్రో సౌండ్ సిస్టమ్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. ఈ టీవీని అధునాతన జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. వాయిస్ నియంత్రణ కోసం ఫార్-ఫీల్డ్ మైక్రోఫోన్, స్మార్ట్ హోమ్ డ్యాష్‌బోర్డ్, Apple AirPlay, HomeKit వంటి చాలా రకాల కనెక్టింగ్‌ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి అందుబాటులో రానున్నాయి. ఈ Panasonic స్మార్ట్‌ టీవీ ధరకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter