Sim Card New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, 52 లక్షల సిమ్ కార్డులు క్లోజ్, కారణమేంటంటే
Sim Card New Rules: డిజిటల్ ఇండియాతో పాటే సైబర్ నేరగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. జనాన్ని మోసం చేసినా, సిమ్ కార్డ్ మోసమైనా సరే డిజిటలైజేషన్ యుగంలో అంతా సులభమైపోయింది. పూర్తి వివరాలు మీ కోసం..
Sim Card New Rules: సైబర్ నేరాల్లో ఎక్కువగా విన్పిస్తున్నది సిమ్ కార్డ్ మోసాలు. గత కొద్దికాలంగా ఆన్‌లైన్, డిజిటల్ మోసాలు అధికమయ్యాయి. వేలల్లో, లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్న సందర్భాలు పెరుగుతున్నాయి. సిమ్ కార్డు మోసాలు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది.
మొబైల్ ఫోన్ సిమ్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం డీలర్లు మల్టిపుల్ సిమ్ కార్డులు జారీ చేయకూడదు. ప్రతి సిమ్ కార్డును తప్పనిసరిగా వెరిఫై చేయాలి. అలా చేయనివారిపై కఠినమైన చర్చలు కూడా ఉంటాయి. ఈ కొత్త నిబంధనల్లో భాగంగా ప్రభుత్వం లక్షలాది సిమ్ కార్డులు, వేలల్లో వాట్సప్ ఎక్కౌంట్లు క్లోజ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో 52 లక్షల సిమ్ కార్డుల్ని క్లోజ్ చేసింది. వేలాది వాట్సప్ ఎక్కౌంట్లను నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 66 వేల వాట్సప్ ఎక్కౌంట్లను నిలిపివేసినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది కాకుండా 67 వేల సిమ్ కార్డు డీలర్లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది. మోసాల్లో పాలుపంచుకున్నవారిపై 300 కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతోపాటు 52 లక్షల మొబైన్ ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా స్కామర్లకు చెందిన 8 లక్షల బ్యాంకు ఎక్కౌంట్లు సీజ్ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన కొత్త సిమ్ కార్డు నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి. సెప్టెంబర్ 30లోగా సెల్లర్లు రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోని డీలర్లు సిమ్ కార్డులు అమ్మితే 10 లక్షల రూపాయలు జరిమానా ఉంటుంది. సిమ్ కార్డులు విక్రయించే డీలర్ ఇకపై ప్రతి సిమ్ తప్పనిసరిగా వెరిఫై చేయించాలి. డీలర్ ఎవరికైనా సిమ్ కార్డు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అదే సమయంలో ప్రభుత్వం తప్పకుండా పోలీస్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సిమ్ కార్డు వెరిఫికేషన్ అంతా ఇకపై టెలీకం ఆపరేటర్లు చేయాల్సి ఉంటుంది. లేకపోతే 10 లక్షల జరిమానా పడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook