Vivo Y02: డెడ్ ఛీప్‌గా మార్కెట్ లోకి Vivo Y02 స్మార్ట్ ఫోన్.. ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Smartphone Under 9K 4gb Ram: మార్కెట్‌లో వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వివో తన బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. సాధరాణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీని ధరను ప్రకటిస్తున్నట్లు సంస్థ తమ అధికారిక వెబ్ సైట్స్‌లో పేర్కొంది.
Smartphone Under 9K 4gb Ram: ప్రతి నెల మార్కెట్‌లోకి కొత్త కొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా మార్కెట్‌లోకి విడుదల కావడం విశేషం. అయితే ఇటీవలే ఎక్కువగా లాంచ్ అయిన ఫోన్లలో యాపిల్‌కి సంబంధించి మొబైల్స్ అధికంగా ఉన్నాయి. మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వివో తమ మరో ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేస్తున్నట్లు అధికరీకంగా ప్రకటించింది సంస్థ. వివో Y02 మోడల్‌తో ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే వివో ఈ ఫోన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీతో కలిసి Vivo Y02 డిజైన్‌ను రూపొందిచినట్లు పేర్కొంది.
Vivo Y02 డిజైన్:
ఇప్పటికే వివో పబ్లికేషన్ ప్రోమో ఇమేజ్‌ను కూడా షేర్ చేసింది. ఇది పరికరాన్ని వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, మందపాటి బెజెల్స్‌తో మార్కెట్‌లోకి విడుదల అవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇందులో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ కూడా అమార్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఒకే కెమెరాతో LED ఫ్లాష్ సదుపాయం హ్యాండ్‌సెట్‌తో మీరు ఈ ఫోన్ మార్కెట్‌లో చూడొచ్చు.
Vivo Y02 స్పెసిఫికేషన్స్:
ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. Vivo Y02 HD+ రిజల్యూషన్‌తో 6.51-అంగుళాల LCD ప్యానెల్ డిస్ప్లే. 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫోటోగ్రఫీ కెమెరాతో మార్కెట్‌లోకి లాంచ్ అవ్వనుంది.
Vivo Y02 బ్యాటరీ:
Vivo Y02 Helio P22 చిప్‌సెటప్‌తో వస్తోంది. ఇందులో 2GB RAM, 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 5,000mAhని అమర్చారు. అంతేకాకుండా ఇందులో 10W ఛార్జింగ్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. హ్యాండ్‌సెట్ వివరాలు చూస్తే ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)లో రన్ అయ్యే అవుతుందని సంస్థ పేర్కొంది.
భారత్‌లో Vivo Y02 ధర:
సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వారి అందుబాటులో ఉండడానికి Vivo Y02 ధరను రూ. 8,499గా ప్రకటించనుంది. ఇది వరకు కూడా ఇలాంటి మోడల్‌ను లాంచ్ చేసినప్పుడు ఇదే ధరతో మార్కెట్‌లోకి లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారుల ముందుకు తీసుకు వస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన వివరాలను మాత్రం సంస్థ ఇంకా వివరించలేదు.
Also Read: Nani Sister Deepthi : సెట్‌లో హీరోయిన్లతో నాని అక్క అలా చేయించుకుందా?.. సినిమా ఆఫర్ కోసం ఇలానా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook