Samsung Galaxy A54 Launch: 50 మెగాపిక్సెల్ కెమేరా, 8 జీబీ ర్యామ్‌తో ఈ నెలలోనే లాంచ్, ఫీచర్లు, ధర ఇలా
Samsung Galaxy A54 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన మోడల్ ఈ నెలలో లాంచ్ కానుంది. అద్భుతమైన కెమేరా, ర్యామ్, బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy A54 Launch: Samsung Galaxy A54 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం రేపనుంది. అద్భుతమైన ఫీచర్లతో మార్చ్ నెలలోనే లాంచ్ కానుంది. శక్తివంతమైన కెమేరా, ర్యామ్, బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో యూజర్లను గొప్ప అనుభూతినిస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమేరా కావడంతో ఫోటోల విషయంలో మంచి అనుభూతి పొందవచ్చు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
శాంసంగ్ త్వరలోనే Samsung Galaxy A54 లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌లో ఒకదాన్ని మించి మరొక ఫీచర్లు ఉంటాయి. బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, కెమేరా ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. అద్బుతమైన డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ధర కూడా మరీ అంత ఎక్కువగా లేకుండా అందుబాటులో ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రిజల్యూషన్ స్టాండర్డ్‌గా ఉండి హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రిజల్యూషన్ 2340×1080 పిక్సెల్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ54లో 50 మెగాపిక్సెల్ కెమేరా, 12 మెగాపిక్సెల్ కెమేరా, 5 మెగాపిక్సెల్ కెమేరాతో 3 కెమేరా సెటప్ ఉంటుంది. ఇది కాకుండా సెల్ఫీ లేదా వీడియా కెమేరా కోసం 32 మెగాపిక్సెల్ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ54లో 8 జీబీ ర్యామ్ ఉంటుంది ఇక స్టోరేజ్ అయితే 128 జీబీ, 256 జీబీల్లో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ54 ప్రోసెసర్ 2.4 ఎంహెచ్‌జెడ్ ఆక్టాకోర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో బ్యాటరీ ఏకంగా 5000 ఎంఏహెచ్ ఉండటం వల్ల ఎక్కువ సేపు ఉంటుంది. Samsung Galaxy A54 ధర ఇండియాలో 33,499 రూపాయలుండవచ్చు.
Also read: Toyota Taisor: టయోటా నుంచి మరో అదిరిపోయే కారు.. లాంచ్ డేట్, ఫీచర్స్ వివరాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook